అనంతపురము: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్… తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య ఎమ్మెల్యే, ఆయన తనయుడు చెప్పినట్లు చేస్తున్నారు.ఇటీవల నా భూములపై ఎమ్మెల్యే కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.
అధికారులు పరిశీలించి 1907 నుంచి రికార్డులు ఉన్నాయి ఇది అస్మిత్ రెడ్డి పేరుతో ఉందని తేల్చారు.ఎం ఎల్ ఎ అండతో డీఎస్పీ చైతన్య నా స్థలాలు కొట్టేయాలని చూశారు.
డీఎస్పీ అక్రమాలపై ఎస్పీ, డీ ఐజీ జోక్యం చేసుకోవాలి.మా మేనేజర్ సిరాజ్ పై అక్రమంగా కేసులు పెట్టాలని నోటీసులు ఇచ్చారు.
మా భూములు లాక్కోవాలని చూస్తున్న డీఎస్పీ పై చర్యలు తీసుకోండి.స్పందించండి… లేదంటే లా ఆండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది.పోలీసులకు చెడ్డపేరు వస్తుంది.నాపై 68 కేసులు పెట్టారు.జనం తిరగబడితే తట్టుకోలేరు… డీఎస్పీ పై విచారణ జరపండి.ఈ విషయం పై ఎంత దూరం అయినా వెళ్లుతా.
ఎం ఎల్ ఎ, డీఎస్పీ భద్రం… పర్సనల్ గా వెళుతున్నారు.రాజకీయం వేరు… వ్యక్తిగతం వేరు.
డీఎస్పీ ఇలాంటి వ్యవహారాలు చేయడం సిగ్గుచేటు.డీఎస్పీ పై కోర్టు లో కేసు దాఖలు చేశాం.
చైతన్య అక్రమాలపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోండి.