సీఎం జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ మాజీ మంత్రి పితాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు టైం ఉన్న ప్రధాన పార్టీల నేతలు మధ్య మాటల యుద్ధాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

ఇదే సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రచారం విషయంలో అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంది.

తాజాగా నవంబర్ 9వ తారీఖు నుండి రాష్ట్రంలో "వై ఏపీ నీడ్స్ జగన్" అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ టీడీపీ నేత మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలకు నమ్మకం పోయిందని ఆరోపించారు.అందువల్లే "వై ఏపీ నీడ్స్ జగన్" అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారని విమర్శించారు.

వైసీపీ పాలనలో ప్రజలు విసుగు చెందారని అన్నారు.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బు పై ఆశతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.తమ ప్రచారం కోసం ప్రజాధనం వాడటం దుర్మార్గమని విమర్శించారు.

Advertisement

మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ఎందుకు కావాలో ప్రజలే ప్రశ్నించాలని పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఇసుక, సార, మైన్స్ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలో ఎవరైనా జరుగుతున్న అవినీతి గురించి ప్రశ్నిస్తే వాళ్లను జైల్లో పెట్టి పోలీసు యంత్రాంగాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.సబ్ ప్లాన్ చట్టం ఎత్తేసి ఎస్సిలను మోసం చేసిన దుర్మార్గుడు జగన్.

కుర్చీలు లేకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.ప్రజాధనాన్ని దోచుకుని దాచుకునే ముఖ్యమంత్రి జగన్ అంటూ పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఫీమేల్ కండక్టర్ బొమ్మ గీసిన ఆర్టిస్టు.. ఆమె రియాక్షన్ చూస్తే...
Advertisement

తాజా వార్తలు