జనవరి 6 ఘటన: కాంగ్రెస్ కమిటీ దర్యాప్తుకు సహకరించని వైనం.. ట్రంప్ మాజీ సలహాదారుకు జైలు శిక్ష..?

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6 న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.

ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.

బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్నాయి.

Advertisement

జనవరి 6 నాటి ఘటనకు సంబంధించి 9 మంది సభ్యులున్న ప్రతినిధుల సభ కమిటీ చేపట్టిన విచారణకు వ్యతిరేకంగా ట్రంప్ పోరాడుతున్న సంగతి తెలిసిందే.దీనిలో ఆయన వ్యక్తిగత చర్యలు, సహాయకులు, రాజకీయ సలహాదారుల పాత్ర వుందని అమెరికా వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ట్రంప్ మాదిరిగానే ఆయన మాజీ సలహాదారు స్టీవ్ బానన్ కూడా విచారణకు మొండికేస్తున్నారు.ప్రతినిధుల సహ సెలక్ట్ కమిటీ అతనికి జారీ చేసిన సెబ్‌పోనాను ధిక్కరించినందుకు గాను ఆయనపై అభియోగాలు మోపారు.దీంతో సోమవారం బన్నన్ అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించనున్నారు.

కమిటీ ముందు విచారణకు హాజరుకావడానికి నిరాకరించడం, కీలక డాక్యుమెంట్లను ఇవ్వకుండా నిరాకరించినందుకు రెండు కౌంట్ల అభియోగాలను బాన్నన్‌పై నమోదు చేశారు.ఇవి రుజువైతే ఆయనకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు 2,000 డాలర్ల జరిమానాను విధించనున్నారు.

హౌస్ కమిటీ సెప్టెంబర్ 23న స్టీవ్ బానన్‌కు సమన్లు పంపింది.మరోవైపు కాంగ్రెస్ కమిటీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

జనవరి 6న వాషింగ్టన్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌ను ట్రంప్ సలహాదారులు వార్ రూమ్‌గా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ట్రంప్ వ్యూహకర్త స్టీవ్ బానన్, లీగల్ కన్సల్టెంట్ రూడీ గిలియాని, జాన్ ఈస్ట్‌మన్‌లు వాషింగ్టన్‌లోని విలార్డ్ ఇంటర్ కాంటినెంటల్‌లోని సూట్‌ల నుంచి కార్యకలాపాలు నిర్వహించారని కాంగ్రెస్ కమిటీ ఆరోపిస్తోంది.

Advertisement

ఈ ముగ్గురు హోటల్ నుంచి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారితో టచ్‌లో వున్నారని కమిటీ సభ్యులు అనుమానిస్తున్నారు.

తాజా వార్తలు