చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల బీభత్సంపై అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.కుప్పం పరిసరాల్లో గజరాజులు చేసిన దాడిలో ఇద్దరు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండు ఏనుగులను అడవిలోకి పంపేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతోంది.ఈ మేరకు సుమారు 40 మంది అటవీ ట్రాకర్స్, ఇతర సిబ్బందితో కలిసి ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
బాణాసంచా పేల్చి, డప్పు వాయిస్తూ ఏనుగులను అటవీలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే తమిళనాడు నుంచి రెండు ఏనుగులు కుప్పంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.







