ఇటీవల కాలంలో పొద్దు తిరుగుడుతో తయారైన నూనె వినియోగం భారీగా పెరిగింది.పైగా ఆరోగ్యానికి కూడా మంచిదని డాక్టర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించడంతో, మార్కెట్లో పొద్దు తిరుగుడు నూనె కు డిమాండ్ చాలా పెరిగింది.
మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంటుందో అటువంటి పంటలను పండించడానికి రైతులు ఆసక్తి చూపుతారు.అందులో ఒకటి ఈ పొద్దు తిరుగుడు పంట.
ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ.ఇసుక, రేగడి, ఒండ్రు నెలలు ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి.ఇక తేమలేని, ఆమ్ల లక్షణాలు లేని పొలాలలో ఈ పంట లో అధిక దిగుబడి సాధించవచ్చు.క్షార లక్షణాలు ఎక్కువగా ఉంటే నాణ్యమైన పంటను పొందవచ్చు.

విత్తనాలు శుద్ధి చేసుకునే విధానం
: పంట కు నీటి పారుదల సౌకర్యం ఉంటే ఎకరాకు రెండు నుండి మూడు కిలోల విత్తనాలు తీసుకోవాలి.అదే వర్షాధారం అయితే ఎకరాకు మూడు నుండి నాలుగు కిలోలు, సంకరాలైతే 2.5 కిలోల విత్తనాలు వేసుకోవాలి.విత్తనాలు భూమిలో వేసే ముందు 12 గంటలు నీటిలో నానబెట్టి పూర్తిగా శుద్ధి చేసుకోవాలి.
తర్వాత అందులో మూడు గ్రాముల కాప్తాన్ లేదా థైరం కలుపుకోవాలి.ఒకవేళ పొలంలో నెక్రోసిన్ ఎక్కువగా ఉంటే కిలో విత్తనాలకు ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనాలను పూర్తిగా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది.

పొద్దు తిరుగుడు పంటకు మేలు రకం విత్తనాలు ఇవే:
1)ఎం.ఎస్.ఎఫ్.హెచ్-8, 2)ఎం.ఎస్.ఎఫ్.హెచ్-17, 3) ఎన్.డి.ఎస్.హెచ్-1 విత్తనాలతో ఎకరాకు 600 కిలోల దిగుబడి పొందవచ్చు.ఇందులో నూనె శాతం 40 నుండి 43 వరకు ఉంటుంది.130-150 సెంటీ మీటర్ల వరకు మొక్కలు పెరుగుతాయి.ఇక పంట కాలం 90 నుండి 95 రోజులు.ఈ మేలు రకం విత్తనాలతో మంచి దిగుబడి పొంది మంచి ఆదాయం పొందవచ్చు.







