గోల్ కొట్టి అతను స్టేడియంలో చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు.! సంబరాలు ఇలా కూడా చేసుకుంటారా.?

రోహిత్, కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు వాళ్ళ లవర్స్ కి స్టేడియం లో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం మనం చాలా సార్లే చూసాము.

కానీ వెనిజులా ఫుటాబాల్‌ ఆటగాడు గోల్‌ చేసిన అనంతరం చేసుకున్న సంబరాలు ఎక్కడా చూసుండరు.

గోల్‌కొట్టిన ఆనందంలో అతను తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు.అంతేకాకుండా ముద్దులతో ఆమెను ముంచెత్తాడు.

సీడీ అంటోఫగస్తా జట్టుకు చెందిన ఎడ్వర్డ్ బెల్లో చీల్స్‌ ఈవెర్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి గోల్‌ సాధించాడు.ఈ ఆనందంలో కోచ్‌ బృందం నుంచి రింగ్‌ అందుకోని సరాసరిగా గ్యాలరీలోని తన ప్రియురాలి వద్దకు పరుగెత్తాడు.ఆమె వేలికి రింగు పెట్టి ప్రపోజ్‌ చేశాడు.

దీనికి ఒప్పుకోవడంతో ఆమె చెంపలను ముద్దులతో తడిపాడు.ఇక గ్యాలరీలో ఉన్న మిగతా ప్రేక్షకులు ఈ ఆకస్మిక ఘటనకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ జంటను చప్పట్లతో అభినందించారు.

Advertisement

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మీరు కూడా ఒక లుక్ వేయండి.!.

మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు