ఇటీవల కాలంలో అడవులు క్రమంగా తరిగిపోతున్నాయి.ఫలితంగా అందులో ఉండే జంతువులకు ఆహారం లభించక, జనావాసాలలోకి వచ్చేస్తున్నాయి.
ఇక అడవిలో నుంచి వెళ్తున్న వాహనాలపై ఇటీవల కాలంలో ఏనుగులు దాడి చేస్తున్నాయి.ఏనుగులు కనబడగానే వాహనాలను చాలా మంది ఆపేస్తున్నారు.
వాటిలో తినుబండారాలు ఏమున్నా వాటిని తీసుకుంటున్నాయి.తాజాగా థాయ్‌లాండ్‌లోని ఖావో యాయ్ నేషనల్ పార్క్ అయితే రహదారి పొడవునా ఏనుగులు ఇలాంటి పనులు చేస్తున్నాయి.
ఒక అడవి ఏనుగు వాహనాన్ని అడ్డుకుంది.దాని వెనుక భాగంలో ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంది.
ఈ ఆసక్తికర అంశానికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.
తరచూ అడవికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర వీడియోలను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తరచూ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా ఆయన అడవిలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏనుగులకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.అందులో ఓ ఏనుగు రహదారి గుండా వెళ్తున్న వాహనాన్ని అడ్డగించింది.
దాని వెనుక భాగంలో ఏమున్నాయో నిశితంగా పరిశీలించింది.ఇలా రహదారి వెంట ఉన్న వాహనాలలో ఏదైనా ఆహారం దొరుకుతుందని అన్వేషించింది.
ఓ ట్రక్కు లాంటి కారు కనిపించగానే దానిని అటకాయించింది.ఏనుగు ట్రక్కుల నుండి వస్తువులను తీసివేయడం ప్రారంభించింది.
అందులో తనకు అవసరం లేని వస్తువులు అన్నింటినీ పక్కన తీసి పడేసింది.మరోవైపు ఆ వాహనంతో పాటు వెనుక చాలా వాహనాలు నిలిచిపోయాయి.
ఆ ఏనుగు తమపై దాడి చేస్తుందేమోనన్న భయంతో వారు ఆందోళన చెందారు.చివరికి ఆ ఏనుగు ప్లాస్టిక్ బాటిల్‌తో సహా చాలా తినదగని వస్తువులను తీసి వేసింది.
ఆహారం కోసం తన వేటలో పెద్ద కంటైనర్లను నేలపైకి విసిరి కొట్టింది.చివరకు అక్కడ దొరికిన ఆహారాన్ని తొండంతో నోటిలో వేసుకుని కడుపు నింపుకుంది.
అడవులలో చెట్లు నరికివేయడం, వాటికి ఆహారం లభించకపోవడంతోనే ఏనుగులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి.అడవుల క్షీణత మరింత ముదిరితే ఏనుగులతో పాటు పలు అడవి జంతువులు జనావాసాలపై దండెత్తడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ దీనిని గమనించాలని సూచిస్తున్నారు.







