ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ప్రకటన పై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందని.దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని రాష్ట్ర బీసీ, పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక రాంనగర్లో 35 లక్షలతో మార్కెట్ ఆధునీకరణ పనులకు మంత్రి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.
తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు.పల్లెలన్ని పట్టణాలుగా మారాలని.
పల్లెలు, పట్టణాలు మెరవాలి.ప్రజలు మురవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని అన్నారు.
గతంలో మహిళలు, ప్రయాణాల్లో.నగరంలో టాయిలెట్స్ కోసం బయటికెళ్లాలంటే ఇబ్బందులు పడే వాళ్ళు.ఆ సమస్యలను అధిగమించాలని నగరం పరిశుభ్రంగా ఉండాలని.23 టాయిలెట్స్ పట్టణ ప్రగతిలో ఏర్పాటు చేయడం జరిగింది.కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం.అందులో వారికి కావాల్సిన అన్ని సమకూరుస్తాం.టాయిలెట్ల ఏర్పాటు పై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో మార్కెట్లు లేక రోడ్లపై అమ్మేవారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేసాం.ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా పని చేస్తున్నాం.
ప్రజల జీవన శైలి ఆధునీకరణ జరిగింది.అన్ని రకాలుగా నగరం అభివృద్ధి చేస్తున్నాం.
మాకు ఉన్న ఏడాదిన్నర సమయంలో ప్రజలు శభాష్ అనేలా అభివృద్ధి చేస్తాం.మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఆరోగ్య నగరంగా ఉండాలి.ప్రజలు సహకరించాలని.
రోడ్లపై ఆక్రమణలు లేకుండా చూసుకోవాలి.నేను కేసీఆర్ అభిమానిని.
ఆయన ఆదేశాలను నేను శిరసా వహిస్తానని.ఆయన ఏది చెప్తే అదే చేస్తా…(మీరు ఎంపీగా ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు )ముఖ్యమంత్రి వెంటే నేనుంటా.
ఆయన మాట నాకు శిరోధార్యం.కేసీఆర్ పార్టీ ప్రకటన పై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభ అయింది.
బీజేపీ కి ప్రత్యామ్నాయం లేక భరించాల్సి వస్తోంది.తెలంగాణలో అమలు చేస్తున్న 50 పథకాలు దేశంలో ఎక్కడా లేవు… ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడంతో దిగుబడి పెరిగింది.
తాగు, సాగు నీటి సమస్య తీరింది.ఇతర రాష్ట్రాల ప్రజలు అందరూ ఇదే చూస్తున్నారు.మాకు ఆ ఫలాలు కావాలని కోరుకుంటున్నారు.80 ఏళ్ళు పాలించిన వారి పాలనను ప్రజలు చూసారు.8 ఏళ్లలో మా పాలన చూసారు…ఇక్కడ అభివృద్ధి తమ వద్ద కావాలని కోరుకుంటున్నారు.Ntr ఆనాడు ప్రారంభించిన్నపుడు 13 నెలల్లో ఆయనను చూసి అధికారం ఇచ్చారు.
ఇప్పుడు అదే ప్రజలు కేసీఆర్ పాలన ను చూస్తున్నారు.కావాలని కోరుకుంటున్నారు.
గుజరాత్ లో మహిళలు నీటికి , రైతులు సాగునీటి కి ఇబ్బందులు పడుతున్నారు.దీనిపై చర్చ జరుగుతోంది.
ప్రజలు ఏది అయితే కోరుకుంటారో కేసీఆర్ అదే చేస్తాడు…దేశంలో బీజేపీ కి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే.







