ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ జగన్ వెంటే కొనసాగుతానని స్పష్టం చేశారు.
మైలవరం నియోజకవర్గం వైసీపీలో గత కొన్ని రోజులుగా వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఎప్పటికీ వైఎస్ కుటుంబంతోనే తన ప్రయాణమని ఎమ్మెల్యే తెలిపారు.
తన నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నది నిజమని చెప్పారు.పార్టీకి నష్టం జరిగేలా తాను ఏ నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు.