ఈ సింపుల్ రెమెడీతో మీ ఐబ్రోస్ దట్టంగా మారడం గ్యారెంటీ!

ఒకప్పుడు ఐబ్రోస్( Eyebrows ) అనేది పల్చగా ఉండటమే ఫ్యాషన్.కానీ ఇప్పుడు ఒత్తైన ఐ బ్రోస్( Thick Eyebrows ) ట్రెండ్ గా మారింది.

చక్కటి షేప్ లో ఒత్తుగా ఐబ్రోస్ కనిపిస్తుంటే మరింత అట్రాక్టివ్ గా మారతారు.అందుకే చాలా మంది మగువలు అటువంటి ఐ బ్రోస్ కోసం ఆరాటపడుతున్నారు.

అయితే కొందరికి ఐబ్రోస్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు.ఇలాంటి వారికి ఐబ్రోస్ అనేవి చాలా పల్చగా ఉంటాయి.

ఈ క్రమంలోనే ఐబ్రోస్ గ్రోత్ ను పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.

Advertisement

మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ రెమెడీతో మీ ఐబ్రోస్ దట్టంగా మారడం గ్యారంటీ.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒకటి లేదా రెండు వాల్ నట్స్( Walnuts ) వేసి పూర్తిగా నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.ఇలా నల్లగా మారిన వాల్ నట్స్ ను మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్ లోకి వేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ మెల్ట్ చేసుకున్న వాసెలిన్,( Vaseline ) వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్,( Vitamin E Oil ) వన్ టీ స్పూన్ బాదం ఆయిల్, వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా త‌మారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇయర్ బడ్ సహాయంతో ఐబ్రోస్ కి అప్లై చేసుకోవాలి.అలాగే ఉదయం స్నానం చేయడానికి గంట ముందు కూడా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి.

టెక్నీషియన్‌తో మహిళ అఫైర్.. గీజర్‌లో కెమెరా పెట్టి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడంటూ నాటకం.. చివరకు?

రోజుకు రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల ఐబ్రోస్ గ్రోత్ అనేది చక్కగా పెరుగుతుంది.కొద్దిరోజుల్లోనే మీ పల్చటి కనుబొమ్మలు నల్లగా ఒత్తుగా మారుతాయి.కాబట్టి ఐబ్రోస్ గ్రోత్ సరిగ్గా లేదు అని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ రెమెడీని ప్రయత్నించండి.

Advertisement

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు