నిత్యం కడుపు ఉబ్బరంగా ఉండడానికి ముఖ్యమైన కారణలు ఇవే..!

చాలా మందిలో కడుపు ఉబ్బరం( Stomach Bloating ) సర్వసాధారణమైన సమస్య.

మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యను కచ్చితంగా ఎదుర్కొని ఉంటారు.

మరి ముఖ్యంగా ఎండాకాలంలో( Summer ) కడుపు ఉబ్బరం సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు.అయితే ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

వీటిలో ప్రధానమైనది మనం తీసుకునే ఆహారం అని చెబుతున్నారు.ఆహారంలో కొన్ని మార్పుల కారణంగా కడుపు ఉబ్బరంగా మారుతుంది.

ఇంతకీ కడుపు ఉబ్బరం సమస్య ఎందుకు వస్తుంది.ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కడుపు ఉబ్బరం తీసుకునే ఆహారం కారణంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా వేయించిన ఆహారాన్ని( Fried Foods ) తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలతో పాటు కొన్నిరకాల ఆరోగ్య సంబంధిత సమస్యలు, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఒత్తిడితో ఇబ్బందిపడుతున్న వారిలోనూ ఇలాంటి సమస్యలు వస్తాయి.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే శరీరకంగా చురుకుగా ఉండేలా చూసుకోవాలి.అందుకోసం వాకింగ్ ను( Walking ) అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.వీటి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

అలాగే యోగాసనాల( Yoga ) వల్ల కూడా కడుపులో గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.మలబద్ధక సమస్య ఉన్నవారు కూడా కడుపుబ్బరం సమస్యతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

కాబట్టి ఇలాంటి వారు తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్త గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా లభించే అరటిపండు, ఆపిల్, ఆరెంజ్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

తాజా వార్తలు