ప్రమాదాలు అనేవి సడన్ గా వస్తూ ఉంటాయి.వంట చేస్తున్నప్పుడు అనుకోకుండా గాయాలు కావచ్చు.
ఆ గాయాలు తొందరగా మానాలంటే ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి సమర్ధవంతంగా తొలగించుకోవచ్చు.ఇప్పుడు ఆ వంటింటి చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ల్యావెండర్ ఆయిల్
ల్యావెండర్ ఆయిల్ కాలిన గాయాలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.కాలిన గాయాల మీద రెండు చుక్కల ల్యావెండర్ ఆయిల్ ని వేసి సున్నితంగా రాయాలి.ఈ విధంగా రోజులో ఐదు సార్లు రాస్తూ ఉంటే క్రమముగా కాలిన గాయాలు తగ్గిపోవటమే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి.
టూట్ పేస్ట్
టూట్ పేస్ట్ కాలిన గాయాలకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.కాలిన గాయాలకు టూట్ పేస్ట్ రాస్తే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
అయితే టూట్ పేస్ట్ వాడేటప్పుడు తెల్లని పుదీనా ఫ్లేవర్ ఉన్న దాన్ని మాత్రమే ఉపయోగించాలి.

వెనిగర్
వెనిగర్ కూడా కాలిన గాయాలను తగ్గించటమే కాకుండా చల్లని ప్రభావాలను కలిగిస్తుంది.కొంచెం నీటిలో వెనిగర్ వేసి బాగా కలిపి కాలిన గాయాలపై రాస్తే చాలా తొందరగా ఫలితం కనపడుతుంది.గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వెనిగర్ ని నీటిలో కలపకుండా ఉపయోగించకూడదు.