కొండచిలువను మెడలో వేసుకుని ఫోజులు.. ఊహించని షాక్..

కొండచిలువలు( pythons ) విషపూరితమైనవి కావు.అయితే వాటికి మనుషులతో పాటు జంతువులను సైతం చంపే శక్తి ఉంటుంది.

 Fojlu Wearing Python Around His Neck Unexpected Shock , Pythons, Animals, Snakes-TeluguStop.com

మనుషులను లేదా జంతువులను అవి చుట్టుకుంటాయి.తర్వాత ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

చివరికి ఎముకలన్నింటినీ విరిచేసి సులువుగా మింగేస్తాయి.తర్వాత తాము మింగిన ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు చెట్టును చుట్టుకుంటాయి.

అందుకే కొండచిలువలను చూస్తే చాలా మంది భయపడతారు.అయితే ఓ వ్యక్తి భారీ కొండచిలువను తన మెడలో వేసుకున్నాడు.

దానితో ఫొటోలు దిగాలని ప్రయత్నించాడు.అయితే చివరికి షాక్ తగిలింది.

ఆ వ్యక్తి మెడను ఆ కొండచిలువ చుట్టుకుని, కింద పడేసింది.చివరికి ఆ ప్రమాదం నుంచి ఆ వ్యక్తి బయటపడ్డాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేరళలోని కన్నూర్‌ వలపట్నం( Kannur Valapatnam in Kerala ) పెట్రోల్ పంపు సమీపంలో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కొండచిలువతో సాహసం చేసేందుకు ప్రయత్నించాడు.ఈ వ్యక్తి తన మెడ చుట్టూ పెద్ద కొండచిలువను చుట్టి ఫొటో తీయడం ప్రారంభించాడు.

ఇప్పటి వరకు స్టంట్‌మ్యాన్‌కి అంతా సులువుగా అనిపించినా ఆ తర్వాత పది అడుగుల కొండచిలువ తన పట్టును బిగించడం ప్రారంభించింది.కొద్దిసేపటికే ఆ వ్యక్తి మెలికలు తిరుగుతూ బాధతో నేలపై పడిపోయాడు.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పేరు చంద్రన్‌గా తెలుస్తోంది.

ఆ వ్యక్తి కొండచిలువను మెడలో వేసుకుని పెట్రోల్ పంపు వద్దకు వచ్చాడు.కొండచిలువతో ఉన్న తనను ఫోటో తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు.అయితే ఆ కొండచిలువ అకస్మాత్తుగా అతడిపై దాడి చేయడం ప్రారంభించింది.

చంద్రన్ మెడను అది గట్టిగా చుట్టుకుంది.దీంతో చంద్రన్ కింద పడిపోయాడు.

వెంటనే పెట్రోల్ బంకు సిబ్బంది అతడిని కాపాడడానికి ప్రయత్నించారు.చివరికి ఆ కొండచిలువ అతడిని విడిచి పెట్టి పాకుకుంటూ వెళ్లిపోయింది.

దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube