భారత సైన్యం( Indian Army ) ఉపయోగించే వాహనాలు అంటే సామాన్య ప్రజలకు చాలా ఇష్టం.వారు వాడిన వాహనాలను ప్రత్యేక వేలంలో సొంతం చేసుకుంటారు.
వాటిని వాడుతూ మురిసి పోతుంటారు.అయితే ప్రజలు వాడే కార్లను( Civilian Cars ) కూడా ఆర్మీ వాడుతుందని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే.సామాన్య ప్రజలు వాడిన కార్లను తమకు అనుగుణంగా మార్పులు చేయించుకుని, వాటిని వినియోగిస్తోంది భారత ఆర్మీ.
అందులో 5 కార్లు నేటికీ ఆర్మీలో వినియోగిస్తున్నారు.
అందులో తొలి స్థానంలో ఉండేది హిందుస్థాన్ అంబాసిడర్. ఈ కారు అనేక దశాబ్దాలుగా భారతదేశంలో ఉంది.
గతంలో పొలిటీషియన్లు ఈ కార్లు వాడే వారు.కారు ఉత్పత్తిని ఆ కంపెనీ 2014లో ఆపేసినప్పటికీ నేటికీ అంబాసిడర్ కార్లు( Ambassador Car ) భారత సైన్యంలో వినియోగిస్తున్నారు.
రెండవ స్థానంలో మారుతీ సుజుకి జిప్సీ.( Maruti Suzuki Gypsy ) భారతీయ సైన్యం 1991 ప్రారంభంలో మారుతీ జిప్సీని నేవీ విధులకు చేర్చుకుంది.
జిప్సీ కాంపాక్ట్, తేలికైన ఫ్రేమ్‌ను కలిగి ఉంది.కష్టతరమైన భూభాగాలపై అధిక సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో సులువుగా ముందుకు వెళ్లొచ్చు.
టాటా సుమో( Tata Sumo ) ఒకప్పుడు కార్లలో రారాజు.ముఖ్యంగా సినిమాలలో దీనిని ఎక్కువగా చూపించే వారు.అలాంటి ఈ ఎస్‌యూవీని ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ కోసం వినియోగిస్తున్నారు.తర్వాత స్థానంలో టాటా సఫారీ స్టార్మ్.( Tata Safari Storme ) ఇండియన్ ఆర్మీ కోసం దీనిని ప్రత్యేకంగా కస్టమైజ్ చేస్తారు.టాటా మోటార్స్ ప్రారంభంలో సఫారీ స్టోర్మ్ జీఎస్ 800 మోడల్యొ 3,192 యూనిట్ల ఆర్డర్ ఇచ్చింది.
చివరిగా మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 4X4. మహీంద్రా కంపెనీ దీని ఉత్పత్తిని పరిమితం చేసినప్పటికీ, ప్రజల కోసం స్కార్పియో( Mahindra Scorpio ) క్లాసిక్ వేరియంట్‌లను తగ్గించినప్పటికీ, శక్తివంతమైన ఎస్‌యూవీ ఇప్పటికీ చాలా మందికి ఎంతో ప్రియమైన కారు.ఇండియన్ ఆర్మీ మహీంద్రా నుండి ఈ లెజెండరీ ఎస్‌యూవీని 1,470 యూనిట్ల కోసం ఆర్డర్ చేసింది.ఈ స్కార్పియో క్లాసిక్‌ల ప్రత్యేకత ఏమిటంటే, అందులో ఉండే శక్తివంతమైన ఇంజిన్.
కఠినమైన ఉపరితలాలపై కూడా ఇది చక్కగా వెళ్తుంది.