నారాయణపేట జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.మక్తల్ లోని ఓ దాబాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అయితే దాబాలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.మంటల ధాటికి దాబాతో పాటు సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.కాగా ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం.







