పంజాబులో తెలంగాణా పథకం

తెలంగాణా ప్రభుత్వం పంజాబులో పథకం అమలు చేయడం కాదు.తెలంగాణలో ఉన్న పథకం వంటిదే పంజాబు ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

తెలంగాణలో కెసీఆర్ సర్కారు హిందూ, ముస్లింలలోని బడుగు వర్గాల ఆడపిల్లల వివాహాల కోసం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పధకాలు ప్రవేశపెట్టింది.వీటి కింద ఆర్ధిక సాయం అందచేస్తున్నది.

ఇదే తరహాలో పంజాబులో ప్రకాష్ సింగ్ బాదల్ సర్కారు షగున్ పధకం ప్రవేశపెట్టింది.దీని కింద పెళ్ళికి నెలరోజుల ముందు ఆర్ధిక సాయం అందిస్తారు.

ఇప్పటివరకు పెళ్లి రోజే ఇస్తున్నారు.వార్షిక ఆదాయం 30,000 ఉన్న ఎస్సీ కుటుంబాల ఆడపిల్లలకు 15,000 ఇస్తారు.

Advertisement

అయితే దీనికంటే తెలంగాణా పధకం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంది.తెలంగాణా సర్కారు రూ.51,000 ఇస్తున్నది.పధకాలు ప్రయోజనకరంగా ఉండాలి కాని నామమాత్రంగా ఉండకూడదు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు