సినిమా విజయాల కోసం చిత్ర పరిశ్రమ క్రూరంగా వ్యవహరిస్తుంది: కంగనా

కంగనా రౌనత్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.

అయితే ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాలను సృష్టిస్తాయి.

తాను ఏ విషయమైనా ముక్కుసూటిగా చెప్పడంతో ఇలాంటి వివాదాలకు కారణం అవుతుంటాయని చెప్పాలి ఇలా ట్విట్టర్ వేదికగా ఈమె ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ట్వీట్లు చేయడంతో ఏకంగా ట్విట్టర్ యాజమాన్యం ఈమె ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈమె ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించడంతో మంగళవారం ఈమె ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ చిత్రపరిశ్రమపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండస్ట్రీలో సినిమా విడుదలైంది అంటే ఇక్కడ ఆ సినిమా ఎంత కలెక్షన్లను రాబట్టింది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని ఈమె వాపోయారు.అయితే షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబడుతున్న సమయంలో కంగనా ఇలాంటి ట్వీట్లు చేయడం గమనార్హం.

ఒక సినిమా విజయం కావడం కోసం చిత్ర పరిశ్రమ చాలా క్రూరంగా వ్యవహరిస్తుందని ఈమె చెప్పుకొచ్చారు.సినిమా అంటే కేవలం లాభాలను పొందడం కోసం చిత్రీకరించేది కాదని ఈమె వ్యాఖ్యానించారు.ప్రాథమికంగా కళ అనేది ఆలయాలలో బాసిల్లుతుంది.

Advertisement

సాహిత్యం థియేటర్ చివరిగా సినిమాలలోకి చేరుతుంది.సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పరిశ్రమ కానీ బిలియన్, ట్రిలియన్ డాలర్లు ఆర్జించేందుకు డిజైన్ చేయబడింది కాదు.

అందుకే కళని, కళాకారులను ఆదరిస్తారే కానీ, పారిశ్రామికవేత్తలు, బిలియనీర్లను కాదు అంటూ ఈమె చిత్ర పరిశ్రమ గురించి చేసినటువంటి ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు