కొంతమంది వీడియోలో కనిపించడానికి అస్సలు ఇష్టపడరు.ముఖ్యంగా పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లో నివసించే అమ్మాయిలు కెమెరాలకు దూరంగా ఉంటారు.
కానీ కొందరు మాత్రం సోషల్ మీడియా( Social media )లో లైక్స్ కోసం ఈ రోజుల్లో రీల్స్ చేస్తున్నారు.అయితే తాజాగా ఒక పాకిస్తాన్ యువతి ( Pakistan girls )తన సిస్టర్ తో కలిసి రీల్ వీడియో చేద్దామనుకుంది.
కానీ కెమెరాలో కనిపించడం ఇష్టం లేని సదరు సిస్టర్ యువతిని బాగా కొట్టింది.తర్వాత వీరిద్దరి మధ్య చిన్నపాటి చెంపల యుద్ధం నడిచింది.

వీడియోలో “నన్ను చూపించొద్దని చెప్పానా!” అని సిస్టర్ తిడుతూ ఉండటం మనం వినవచ్చు.తిట్టాక ఆమె కొట్టింది.కొట్టిన తర్వాత ఈ యువతి తిరగబడింది.ఇద్దరు ఒకరికి ఒకరు కొట్టుకున్నారు.ఈ దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డయ్యాయి చివరికి యువతి బాగా దెబ్బలు తగలడంతో ఏడవడం మొదలు పెట్టింది.దాంతో వీడియో ముగిసింది.

ఆ సిస్టర్స్ మధ్య చోటు చేసుకున్న ఈ ఘటనను చూసి చాలామంది నవ్వుతున్నారు.సిస్టర్స్ మధ్య ఇలాంటి చిన్న పాటి గొడవలు సర్వసాధారణమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.కానీ చివరిలో ఏడుపు ముఖం పెట్టిన ఆ యువతిని చూస్తుంటే బాగా నవ్వొస్తుందని కామెంట్లు చేస్తున్నారు.ఘర్ కే కలేష్ అనే ట్విట్టర్ అకౌంట్ ( Twitter )ఈ వీడియోను షేర్ చేసింది.
ఈ అమ్మాయిలు చెంప దెబ్బలు లాగిపెట్టి కొట్టుకోవడం భలే ఫన్నీగా ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.ఈ వీడియోలో ఆ అక్కాచెల్లెళ్లు పాకిస్తానీ, బ్రిటీష్ యాసలో మాట్లాడినట్లు నెటిజన్లు చెప్పారు.
మరి కొందరు “ఇంకా నయం, వీరు ఏకే47కి బదులు చేతులు మాత్రమే వాడారు” అని పరోక్షంగా ఆ దేశ ఉగ్రవాద కార్యక్రమాలను విమర్శించారు.ఈ ఫన్నీ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.







