పాపను కంటికి రెప్పలా కాచుకోవాల్సి ఆ తండ్రే కుమార్తెపై క్రూరంగా ప్రవర్తించాడు.మూడేళ్ల పసిదని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు.
చివరకు నేలకేసి కొట్టి బయటకు వెళ్లిపోయాడు.ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతంలో చోటు చేసుకుంది.అయితే ఆ తండ్రి ఎందుకు అంత కర్కశంగా వ్యవహరించాడు, ఆ తర్వాత అతడెక్కడి వెళ్లిపోయాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బోరబండకు చెందిన బాసిత్ అలీఖాన్, మాసబ్ ట్యాంక్ సమీప ఫస్ట్ లాన్సర్ కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేస్కున్నారు.వీరికి నలుగు కుమార్తెలు ఉన్నారు.
ప్రస్తుతం భార్యా పిల్లలతో కలిసి అలీఖాన్ ఏసీ గార్డ్స్ లో అధ్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.సనా ప్రస్తుతం 8 నెలల గర్భవతి.ఆటో డ్రైవర్ గా వచ్చే సంపాదన చాలక, ఇతర కారణాలతో బాసిత్ కొన్నాళ్లుగా పిల్లలవై విపరీతంగా కోప్పడుతున్నాడు.ఈ క్రమంలోనే మూడేళ్ల కూతురు ఫాతీమా స్నానాల గదిలో ఆడుకుంటోంది.
బయటకు రమ్మని పిలిస్తే.రాలేదన్న కోపంతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు.
అడ్డుకోబోయిన భార్యను కూడా కొట్టాడు.

ఆమె స్పృహ తప్పి పడిపోగానే కుమార్తెను పైకెత్తి నేలకేసి కొట్టి బయటకెళ్లిపోయాడు.స్పృహ వచ్చాక పాప పడుకుందని తల్లి భావించింది.కానీ పాలు పట్టిస్తానని లేపగా శరీరం చల్లగా ఉండడం, నోట్లోంచి నురగలు రావడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది.
ఆ తర్వాత భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన పోలీసులు అలీఖాన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
నలుగురు పిల్లలతో పాటు గర్భిణీ తాను భర్త లేకుండా ఎలా బతకాలంటూ కన్నీరుమున్నీరువుతోంది.







