4 రోజుల కవల పిల్లలకు విషం ఇచ్చిన తండ్రి!

కాలం మారింది.ఆడపిల్లలు, మగపిల్లలు తేడా లేదు ఎవరైనా ఏ పని అయినా చెయ్యగలరు.

మగపిల్లల కంటే ఆడపిల్లలలే ఎక్కువ పనులు చేస్తున్నారు.కానీ ఆడపిల్ల అంటే ఇప్పటికి చులకనే.

Father Poisoned Twin Girls, Father Poisoned, Twin Girl Child, Mahaboob Nagar, Tw

ఇక అలానే ఇద్దరు కవల పిల్లలను దారుణంగా చంపేశాడు ఓ కసాయి తండ్రి.ఈ దారుణ ఘటన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.దేశాయిప‌ల్లికి చెందిన కృష్ణ‌వేణి, కేశ‌వులు దంప‌తుల‌కు సెప్టెంబర్ 1 వ తేదీన రాత్రి కవల పిల్లలు పుట్టారు.

Advertisement

అప్పటికే వారికి ఒక కూతురు ఉంది.మళ్లీ కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో తండ్రి జీర్ణించుకోలేకపోయారు.

కోపంతో ఆ పిల్లలను ఇద్దరిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.దీంతో భార్యకు తెలియకుండా శిశువులు ఇద్దరికీ పురుగుల మందు తాగించాడు.

పిల్లలు ఇద్దరు అపస్మారక స్థితికి చేరడంతో తల్లి ఆ శిశువులను ఇద్దరినీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.వారిని పరిశీలించిన వైద్యులు వారిద్దరికి విషం ఇచ్చినట్టు గుర్తించారు.

మెరుగైన చికిత్స కోసం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ద‌వాఖాన‌కు శిశువుల‌ను తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా తండ్రి పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అవ్వగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

స్టామినా పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం
Advertisement

తాజా వార్తలు