కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.ట్రాలీని టాటా మ్యాజిక్ వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఈ ఘటన గండేపల్లి మండలం మల్లేపల్లి దగ్గర చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.







