వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాశ్మీర్ మాజీ సీఎం

కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాశ్మీరీ ప్రజలు తమను భారతీయులుగా భావించుకోవడం లేదని,ఆలా అని వారు పాకిస్థానీ లు కూడా కాదు అని వారంతా కూడా చైనా పాలన కోరుకుంటున్నారు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వారితో మాట్లాడితే వారిలోని చైనీయులు బయటపడతారు అని ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.పలు అంశాలపై స్పందించిన ఆయన ‘మీరు కశ్మీర్‌ ప్రజలతో మాట్లాడితే వారు భారతీయులు గా భావించుకోవం లేదని, భారత్‌లో జీవించలేమనే ఆందోళన వారిలో కనిపిస్తుంది అని అన్నారు.

Farooq Abdullah Sensational Comments On Kashmir People, Farooq Abdullah, Kashimi

ప్రస్తుతం వారు భారత ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరు.ఎందుకంటే వాళ్లు గాంధీ భారత్‌లో విలీనమయ్యారుగాని మోదీ భారత్‌లో కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు నుంచి చైనా ముందుకు దూసుకొస్తోంది.కాశ్మీరీలతో మాట్లాడితో వారిలోని చైనీయులు బయటపడతారు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

చైనా తన ప్రాంతంలోని ముస్లింలకు ఏ గతి పట్టించిందో అందరికీ తెలిసిందే.నేను ఈ విషయంలో కచ్చితంగా ఉన్నాను.

కాశ్మీరీలు పాక్‌కు కూడా వెళ్లరు, అక్కడంతా కుళ్లిపోయింది అని ఫరూక్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు