ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.ఈ క్రమంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు.
ఈ నేపథ్యంలో బాధితులకు ఆర్థికసాయంతో పాటు పంట నష్టాన్ని అందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.