కే జీ ఎఫ్ 2 సినిమా తో వెయ్యి కోట్ల కు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యష్ తదుపరి సినిమా విషయం లో ఇంకా క్లారిటీ రావడం లేదు.ఇటీవల ఆయన పుట్టిన రోజు జరుపుకున్నాడు.
ఆ సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ ఉంటుందని దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.కానీ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది క్లారిటీగా చెప్పడం లేదు.తనకు కేజీఎఫ్ ను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమా ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి.
అదే నిజమైతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ షూటింగ్ పూర్తి అవ్వాలి, ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఆయన కమిటైన సినిమా కూడా పూర్తి అవ్వాలి.

ఆ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత మాత్రమే యష్ తో సినిమా కు ప్రశాంత్ నీల్ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.కనుక కచ్చితంగా ఆ సినిమా కు ప్రశాంత్ నీల్ కనీసం రెండున్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలు తీసుకునే అవకాశం ఉంది.అంటే యష్ కొత్త సినిమా రావడానికి ఐదు సంవత్సరాల సమయం పడుతుంది అన్నమాట.
ఫ్యాన్స్ ఎదురు చూపులకు యష్ నుండి ఎలాంటి సమాధానం లేదు.సస్పెన్స్ కి తెర ఎప్పుడు దించుతాడు అనేది కూడా క్లారిటీ లేదు, ఇలా పదే పదే అభిమానులకు చిరాకు పెడుతున్నాడు అంటూ యష్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కన్నడం లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రస్తుతం యష్ కి అభిమానులు ఉన్నారు.అలాంటి హీరో ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
కానీ ఆయన మాత్రం అలా వ్యవహరించడం లేదంటూ అభిమానులు స్వయంగా నిట్టూరుస్తున్నారు.







