విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్( Vijay Devarakonda, Mrinal Thakur ) జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ( Family star movie ) విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఒకింత ఎక్కువ రన్ టైమ్ తోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం.
ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 2 గంటల 40 నిమిషాలు అని తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ రాగా దిల్ రాజు బ్యానర్ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సినిమాను కోరుకుంటారో ఈ సినిమా అదే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది.తమిళనాడు రాష్ట్రంలో 250 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.విజయ్ దేవరకొండ, దిల్ రాజు ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఫ్యామిలీ స్టార్ సినిమాకు గోపీసుందర్ ( Gopisunder )మ్యూజిక్ అందించగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.ఉగాది పండుగ కానుకగా విడుదల అవుతుండటం ఈ సినిమాకు అదనంగా కలిసొస్తుందని చెప్పవచ్చు.మృణాల్ ఖాతాలో ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్లు చేరతాయేమో చూడాల్సి ఉంది.ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఎక్కువ సంఖ్యలో సెలవులు ప్లస్ కానున్నాయి.

అయితే టిల్లూ స్క్వేర్ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఫ్యామిలీ స్టార్ కు మరింత బెటర్ టాక్ వస్తే బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.మృణాల్ ఠాకూర్ భవిష్యత్తులో సైతం భారీ హిట్లను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.ఆమె ఎంచుకుంటున్న పాత్రలే ఆమె రేంజ్ ను పెంచుతున్నాయి.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం.