ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోన్న ఒకే ఒక్క టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.( AI ) ఏఐ రాకతో ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
కంప్యూటర్ మన జీవితంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో ఎలాంటి అనుభూతులకు లోనయ్యామో ఇపుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంతకుమించి అనేలాగా మార్పులకు అవుతున్నాం.ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తాజాగా అమెరికా( America ) రక్షణకు గుండెకాయ లాంటి పెంటగాన్ లో పేలుడు( Pentagon ) జరిగిందని కొన్ని ఫోటోలు బయటకు రావడంతో పెనుదుమారం చెలరేగింది.
కాగా ఇది నిజమో కాదో అని నిర్ధారణ చేసుకోకుండానే కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దాన్ని ప్రచారం చేయడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించి పోయింది.దీంతో స్టాక్ మార్కెట్ లు( America stock Sarket ) కుదేలయ్యాయని చెప్పుకోవచ్చు.తరువాత అసలు నిజం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పెంటగాన్.గురించి మీరు వినే వుంటారు.అదొక అమెరికా రక్షణ కోటగా చెప్పుకోవచ్చు.
అమెరికాకు సంబంధించి పోలీసు నుంచి ఇతర రక్షణ విభాగాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో కేంద్రీకృతం అయి ఉంటాయి.
అలాంటి కట్టుదిట్టమైన పెంటగాన్ లో పేలుడు జరిగితే ఎలా? పెంటగాన్ లో పేలుడు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ ఎరుకే.కాగా తర్వాత అసలు నిజం తెలిసి అందరూ నవ్వుకున్నారు.తర్వాత దాని మూలం తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తే వారికి అప్పుడు అసలు విషయం తెలిసింది.
ఇది కృత్రిమ మేథ ద్వారా రూపొందించిన చిత్రమని అర్ధం అయింది.ఈ పేలుడుకు సంబంధించి వార్తలు దావనం లాగా వ్యాపించడంతో అర్లింగ్టన్, వర్జినియా ప్రాంతాల నుంచి అగ్నిమాపక బృందాలు పెంటగాన్ కి వచ్చాయట.
అయితే ఆ ఫోటోలు ఎవరో ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం రచ్చకెక్కింది.ఏదిఏమైనా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు.