ఆస్కార్ అవార్డుని( Oscar Award ) ప్రపంచంలోనే సినిమా వారు అతున్నంత పురస్కారంగా భావిస్తున్నారు.అందుకే ఒక ఆస్కార్ మన దేశంలోని ఎంతో మందికి ఎక్కడ లేని గౌరవాన్ని, ఒకింత గర్వాన్ని ఇచ్చింది.
ఇక కీరవాణి మరియు చంద్ర బోస్ ఏ ముహూర్తాన అయితే ఆస్కార్ ఒడిసి పెట్టుకున్నారో అప్పటి నుంచి వారికి ఎంతో మంది సోషల్ మీడియా లో శుభాకాంక్షలు చెప్తూనే ఉన్నారు.
ఇక కీరవాణి సంగతి పక్కన పెడితే చంద్రబోస్ కి( Chandrabose ) మాత్రం అన్ని వైపులా నుంచి మంచి అప్లాజ్ వస్తుంది.అయితే ఇంత పెద్ద అవార్డు అందుకున్నాక మేఘాల్లో తేలిపోకుండా చంద్ర బోస్ తన రూట్స్ కి వెళ్లి అందరిని కలుస్తున్నాడు.ముఖ్యంగా తనకు మొట్ట మొదటి సినిమా అవకాశం ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ కి వెళ్లి నిర్మాత సురేష్ బాబు ని( Producer Suresh Babu ) కలిసి తనకు వచ్చిన ఆస్కార్ ఆయనకు చూపించారు.
తాను ఇంత స్థాయికి రావడానికి కారణం అయినా వారికి ఆస్కార్ మర్యాద పూర్వకంగా కలిసి చూపించాలి అనుకోవడం చంద్ర బోస్ లాంటి వ్యక్తి కె సాధ్యం.
ఇక సురేష్ బాబు నుంచి వచ్చాక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి దగ్గరికి వెళ్లి కలిసి ఆయనకు పాదనమస్కారం చేసుకున్నాడు.ఇలా తొలినాళ్లలో తనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన వారిని కలవడం నిజంగా ఎంతో మంచి పరిణామం అని చెప్పాలి.ఎంత మంది తమకు తొలినాళ్లలో ఛాన్సెస్ ఇచ్చిన వారిని గుర్తించుకుంటారు చెప్పండి.
ఇక చంద్ర బోస్ భార్య సుచిత్ర ( Suchitra ) సైతం మొదటి నుంచి ఎన్నో ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.
ఆమె కూడా ఎక్కడ మాట పొల్లు పోకుండా చంద్ర బోస్ గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడుతూ వచ్చారు.తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వ్యక్తి వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఎంతో మంది న్యూస్ ఛానెల్స్ అడిగిన ఆమె ఎక్కడ కూడా అందుకు అవకాశం ఇవ్వలేదు.మరి అంత స్థాయి వారు పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టే ఇప్పటికి ఈ కపుల్ సెలబ్రిటీస్ పైన ఇండస్ట్రీ లో చాల మందికి నచ్చిన వారిగా ఉన్నారు.