నువ్వు హీరో అవుతావా అని స్నేహితుడు అపహాస్యం.. నిజంగానే హీరో అయి చూపించాడు..!! 

చాలా మంది సినిమాల్లో నటించి, పేరు తెచ్చుకోవాలని కలలు కంటారు.ఆ కలలను నెరవేర్చుకోవడానికి తిండి తిప్పలు మాని ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుంటారు.

అద్భుతమైన ప్రతిభ, కొంచెం అదృష్టం ఉంటే చాలు వీరు నటుడిగా రాణిస్తారు.ఒకసారి సత్తా నిరూపించుకుంటే చాలానే అవకాశాలు వస్తాయి కాబట్టి టాప్‌ యాక్టర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

ఆ పొజిషన్‌కి వచ్చాక "నేను నటుడి కావాలని అనుకోలేదు.అనుకోకుండా జరిగింది" అని కొందరు మాట్లాడుతుంటారు.

వారి మాటల్లో నిజం ఎంత ఉందో మనకు అర్థం కాదు.కానీ, కొందరి విషయంలో అది అక్షరాలా నిజమవుతుంది.

Advertisement

అలాంటి అతికొద్ది మందిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాక్టర్ చరణ్‌రాజ్‌( Actor Charan Raj )) ఒకరు.

బెల్గాం( Belgaum )లో పుట్టిన చరణ్‌రాజ్‌ పాఠశాల రోజుల నుంచే పాటలు పాడేవాడు, డాన్సులు చేసేవాడు.సరదాగా ఆ కార్యకలాపాలలో పాల్గొనేవాడు కానీ సినిమాల్లో చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాకపోయేది.ఒకానొక సందర్భంలో ఈ నటుడు కాలేజీలో జరిగిన కల్చరల్‌ కాంపిటీషన్‌( Cultural Competition )లో ఏకంగా నాలుగు గిఫ్ట్స్ సునాయాసంగా విన్ అయ్యాడు.

చరణ్‌రాజ్‌ జీవితంలో ఇదొక పెద్ద విజయం.దానిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఒక ఫ్రెండ్."అరే నువ్వు డాన్సులు బాగా చేస్తున్నావు అందంగానే ఉన్నావు హీరో అవ్వచ్చు కదా" అని ఒక సలహా చెవిన పడేశాడు.

ఇంతలోనే మరొక స్నేహితుడు గురురాజ్‌భట్‌ ‘ఒరేయ్‌ చరణ్‌ నువ్వు హీరో అవ్వడమేంటిరా? ఫేస్‌ను అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా?’ అంటూ ఎగతాళి చేస్తూ అవమానకరంగా మాట్లాడాడట.దాంతో కోపానికి గురైన చరణ్‌రాజ్‌ మనిషే తలుచుకుంటే ఏదైనా సాధ్యమైనంత నేను హీరోని కాలేనని నువ్వు అంటున్నావు కానీ కాగలను అని నేను అంటా అని ఆవేశంగా అనేశాడు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

అయితే హీరో అయి చూపించరా అని గురురాజ్‌భట్‌ అతడిని మరింత రెచ్చగొట్టాడు.దాంతో "నేను హీరో అయి చూపిస్తా ఇదే నా ఛాలెంజ్" అంటూ శపథం కూడా చేశాడు.

Advertisement

అంతేకాదు ఇంట్లో కొంత డబ్బు తీసుకొని బెంగళూరు వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సంవత్సరాలు ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా అలాగే తన ప్రయత్నాలను కొనసాగించాడు.చివరికి కన్నడ సినిమా ‘పరాజిత’( Parajitha )తో హీరోగా వెండితెరపై మెరిసాడు.

అది 100 రోజులు దిగ్విజయంగా ఆడి సూపర్ హిట్ అయింది.దీంతో చరణ్ రాజ్ పేరు మార్మోగింది.

ఒకేసారి 10 మూవీ ఆఫర్స్ వచ్చాయి.వాటిని చేసుకుంటూ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిపోయాడు.

చరణ్‌రాజ్‌ హీరోగా చేసిన ఏడు సినిమాలు వరుసగా హిట్ అవుతూ అతడిని మరింత అగ్రస్థానంలో నిలబెట్టాయి.అదే సమయంలో చరణ్‌రాజ్‌ బ్యాక్‌గ్రౌండ్( Charan Raj Background ) గురించి అందరికీ తెలిసింది.

మరోవైపు ఫ్యాన్ అసోసియేషన్స్ పుట్టగొడుగుల పుట్టుకొచ్చాయి.ఒక సన్మాన కార్యక్రమం కూడా అతని కోసం ఏర్పాటు చేశారు.

దానికి హాజరు కావడానికి ఎయిర్‌పోర్ట్‌ నుంచి కారులో వస్తున్న చరణ్‌రాజ్‌కు స్నేహితుడు గురురాజ్‌భట్‌ తారాసపడ్డాడు.అతడిని అంత మంచి పొజిషన్‌లో చూసి సదరు స్నేహితుడు ఏం మాట్లాడలేకపోయాడు.

హృదయపూర్వకంగా అభినందించడం తప్ప.ఆ రోజు చరణ్‌రాజ్‌ జీవితంలో మరపురానిదిగా మిగిలిపోయింది.

"నువ్వు గొప్పవాడివి.నీ స్నేహితుడు గురురాజ్‌భట్‌ గొప్పవాడా?" అని ఎవరైనా అడిగితే, "నా స్నేహితుడు గురురాజ్‌భట్‌ నాకన్నా గొప్పవాడు.నేను ఇంత పెద్ద నటుడిని, ఇంత పేరు తెచ్చుకోవడానికి అతనే కారణం" అని చరణ్‌రాజ్‌ సగర్వంగా చెబుతాడు.

ఒక స్నేహితుడితో ఛాలెంజ్‌ చేసి హీరో అయిన చరణ్‌రాజ్‌, తర్వాత విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా( Character Artist ) కూడా నటించాడు మొత్తం 400 (తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ) సినిమాల్లో నటించి గొప్ప యాక్టర్ అనిపించుకున్నాడు.

తాజా వార్తలు