మరో రెండు రోజుల్లో ఫేస్బుక్, ట్విట్టర్ బ్లాక్ కాబోతున్నాయా..?!

ఇప్పుడు సోష‌ల్ మీడియాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

మ‌రీ ముఖ్యంగా ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అగ్ర స్థానాల్లో ఉన్నాయి.

అయితే ఈ యాప్‌లు త్వ‌ర‌లోనే బ్లాక్ లిస్టులోకి వెళ్ల‌నున్నాయా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.ఎందుకంటే ఈ సోష‌ల్ మీడియా యాప్‌ల‌కు కేంద్రం ఇచ్చిన గ‌డువు తీరిపోయింది.

Facebook, Twitter, Blocking, Social Meida, 2 Days, Viral News, Viral Latest,soci

కేంద్ర ఏం గ‌డువు ఇచ్చింది అంటారా.అదేనండి ఈ సంస్థ‌ల‌కు కొన్ని నిబంధ‌న‌లు విధిస్తూ వీటినిపై మూడు నెలల్లోగా స్పందించాల‌ని ఆదేశించింది.ఫిబ్ర‌వ‌రి 26న ఈ ఆదేశాలు జారీ చేసింది.మే26తో మూడు నెల‌ల గ‌డువు అయిపోతోంది.కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఒకే ఒక్క సంస్థ మాత్ర‌మే దీనిపై స్పందించింది.

మిగ‌తా యాప్‌ల‌ను కొన‌సాగించ‌లేక పోవ‌చ్చ‌నే అనుమానం క‌లుగుతోంది.కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఓటీటీ మాద్యమాల్లో మూడు అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన‌ట్టు తెలిపారు.

Advertisement

ఓటీటీ, డిజిటల్ న్యూస్ యాప్‌ల‌కు సంబంధించిన సమాచారం ఖ‌చ్చితంగా ప్రభుత్వానికి వెల్లడించాల‌న్నారు.రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తాము చెప్పట్లేద‌ని వివ‌రించారు.

కేవలం ఆ యాప్‌ల స‌మాచారం మాత్ర‌మే తాము కోరుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలకు ఒకే ఒక్క యాప్ మాత్ర‌మే అంగీక‌రించింది.

మిగిలిన ఏ ఒక్క సంస్థ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.దీంతో ఆయా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది.

కేంద్రం విధించిన నిబంధ‌న‌లు ఏంటంటే.ఒక సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిస్తే 36 గంటల్లోగా తొల‌గించాలి.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

ఏదైనా సైబర్ నేరాల ఘటనలపై అడిగిన స‌మాచారం 72 గంటల్లోగా ఇవ్వాలి.ఇక లైంగిక దాడికి సంబంధించిన వాటిపై అడిగి వెంట‌నే స్పందించాలి.

Advertisement

అలాగే జాతి, మ‌త ప‌ర‌మైన విధ్వేషాలు రెచ్చ‌గొట్టేలా పోస్టుల‌ను అనుమ‌తివ్వ‌రాదు.

తాజా వార్తలు