విద్వేషాలు, దాడులను ప్రేరేపించడానికి, చైల్డ్ ట్రాఫికింగ్‌కి, ఇంకా తదితర చట్ట విరుద్ధమైన వస్తువులను తరలించడానికి ఫేస్బుక్( Facebook ) వేదికగా మారుతోందని ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి.ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను తన ప్లాట్ఫామ్లో అరికట్టేందుకు మెటా( Meta ) అన్ని చర్యలూ తీసుకుంటోంది.
కొన్ని విషయాల్లో మాత్రం చర్యలు తీసుకోలేక అందర్నీ ఆగ్రహానికి గురిచేస్తుంది.తాజాగా ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో కొన్ని అకౌంట్లు అశ్లీల వీడియోలను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
వీటిని ఫేస్బుక్ ఆపలేకపోయింది.
ఫేస్బుక్ తన ప్లాట్ఫామ్లో అడల్ట్ కంటెంట్‌ను( Adult Content ) ప్రదర్శించడాన్ని నియంత్రించలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అనేక అకౌంట్స్ అశ్లీల వీడియోలను పంచుకోవడం, వేలాది మంది పార్టిసిపెంట్లతో ప్రత్యక్ష ప్రసారాలను హోస్ట్ చేయడం యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. ‘వైరల్ వీడియోస్,’ ‘రాధిక,’ ‘నూతన్ కుమారి,’ ‘మరియోమా ఫిట్’ వంటి అకౌంట్స్ పోర్న్ కంటెంట్‌ను షేర్ చేస్తున్నాయని ఎన్‌ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్షాట్లు, లింక్‌లు వెల్లడిస్తున్నాయి.
ఈ అకౌంట్ల హోల్డర్ల తమ ప్రొఫైల్ సెక్షన్లలో తమది ఓ వీడియో లేదా గేమింగ్ క్రియేటర్ పేజీగా పేర్కొంటూ, శృంగార వీడియోలను షేర్ చేస్తున్నారు.నగ్నత్వం, లైంగిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఫేస్బుక్ పాలసీలు అమలవుతున్నాయి.అటువంటి కంటెంట్‌ను నిషేధించడానికి భారతదేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయినా ఈ ఖాతాలు ఫేస్బుక్ బ్యాన్ చేయలేదు.ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో కూడా ఇలాంటి అడల్ట్ కంటెంట్ ప్రత్యక్షమవుతోంది.వీటికి ఎంత త్వరగా కళ్లెం వేస్తే అంత మంచిదని యూజర్లు ఫేస్‌బుక్‌కి సూచిస్తున్నారు.
మరి ఫేస్బుక్ న్యూడ్, సెక్సువల్ కంటెంట్‌ను తొలగించడానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.