ట్రంప్ పోస్ట్ ను డిలీట్ చేసిన ఫేస్ బుక్.. ఎందుకంటే !

చిన్నారుల్లో నియంత్రణకు సంబంధించి రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు ట్రంప్ చేసిన పోస్టును ఫేస్ బుక్ డీలీట్ చేసింది.

దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ కి గురయ్యారు.

కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ పై తప్పుడు ప్రచారాలు నియంత్రించడానికి పోస్టును తొలగించడం జరిగిందని ఫేస్ బుక్ పేర్కొంది.ఆ పోస్టు తమ విధానాలకు విరుద్ధంగా ఉందని ఫేస్ బుక్ విధాన ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

దేశ వ్యాప్తంగా కరోనా శరవేగంగా విస్తరిస్తోంది.దేశ అధ్యక్షులు తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడానికి వ్యాక్సిన్ అందుబాటులో తేవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజల అవగాహన కలిగించేందుకు, ఏ విషయాన్నేనా సోషల్ మీడియాలో షేర్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

Advertisement

గతంలో ట్రంప్ ఓ టాబ్లెట్ ను వైద్యుల పర్యవేక్షణలో వాడుతున్నని చెప్పారు.ఈ వార్త కొద్ది నెలల కిందట హల్ చల్ చేసిన విషయం అందరికి తెలిసిందే.

తాజాగా చిన్నారులో వైరస్ నియంత్రణకు రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.కరోనా చిన్న పిల్లలకు సోకినా తొందరగా క్యూర్ అవుతుందని అభిప్రాయపడ్డారు.

అయితే ఈ కామెంట్ ను ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.దీనికి స్పందించి ఫేస్ బుక్ పోస్టును తొలగించింది.

కరోనాపై ఇప్పటికే తప్పుడు ప్రచారాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, విధానాలు ఉల్లంఘించినట్లు ఉండటం వల్లే పోస్ట్ ను తొలగించామని ఫేస్ బుక్ విధాన ప్రతినిధి పేర్కొన్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు