పచ్చి బఠానీల‌తో ఇలా చేస్తే చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరిసిపోతుంది..తెలుసా?

ప‌చ్చి బ‌ఠానీలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ర‌క్త హీన‌త‌ను నివారించ‌డంలోనూ, కంటి ఆరోగ్యాన్ని పెంచ‌డంలోనూ, బ‌రువును త‌గ్గించ‌డంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా మార్చ‌డంలోనూ.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి.అలాగే చ‌ర్మ సౌంద‌ర్యానికీ ప‌చ్చి బఠానీలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ప‌చ్చి బ‌ఠానీల్లో ఉండే కొన్ని ప్ర‌త్యేకమైన పోష‌కాలు చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా మెరిపించ‌గ‌ల‌వు.మ‌రి ఇంత‌కీ ప‌చ్చి బ‌ఠానీల‌ను చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక గిన్నెలో రెండు ప‌చ్చి బ‌ఠానీలు మ‌రియు ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని నైటంతా నాన‌బెట్టుకోవాలి.ఉద‌యాన్నే నీటిని తొల‌గించి ప‌చ్చి బ‌ఠానీల‌ను మాత్రం మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్ప‌డు చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ ప‌చ్చి బ‌ఠానీ పేస్ట్‌, చిటికెడు క‌స్తూరి ప‌సుపు, ఒక స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

వారంలో మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుని.చ‌ర్మంపై ఉండే న‌ల్ల మ‌చ్చ‌లు మ‌రియు ముడ‌త‌లు పోయి ముఖం య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

అలాగే ఒక క‌ప్పు ప‌చ్చి బఠానీల‌ను అర గంట పాటు నీటిలో నాన బెట్టుకుని.ఆపై కుక్క‌ర్‌లో నాలుగైదు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి.ఇప్పుడు వీటిని మెత్త‌గా పేస్ట్ చేసుకుని.

అందులో మూడు స్పూన్లు గ్రీన్ టీ(ముందుగా త‌య‌రు చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి), ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాల ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి కాసేపు ఆర‌బెట్టుకోవాలి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

అనంత‌రం స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ కూల్ వాట‌ర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం స్మూత్‌గా, సాఫ్ట్‌గా, గ్లోగా మారుతుంది.

Advertisement

మ‌రియు డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా తొల‌గిపోయి ముఖ చ‌ర్మం హెల్తీగా మారుతుంది.

తాజా వార్తలు