అమెజాన్‌లో కళ్లు చెదిరే డీల్.. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్!

ఐఫోన్ 14 ( iPhone 14 )ప్రస్తుతం భారతదేశంలో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.దీని అసలు ధర రూ.

79,900 కాగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రూ.71,999కి కొనుగోలు చేయవచ్చు.అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌ని( HDFC Bank Card ) ఉపయోగించడం ద్వారా ధరను రూ.4000 వరకు తగ్గించవచ్చు.పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి కూడా రూ.22,500 వరకు ధర తగ్గించుకోవచ్చు.ఇలా ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు.

ఇకపోతే ఐఫోన్ 14 6.1-అంగుళాల డిస్‌ప్లే, 5G కనెక్టివిటీ, A15 బయోనిక్ చిప్( A15 bionic chip ), 512జీబీ వరకు ర్యామ్ కలిగి ఉంది.దీని డ్యూయల్-కెమెరా సిస్టమ్ డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఐఫోన్ 14 దాని అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన స్పెసిఫికేషన్‌ల కారణంగా భారతదేశంలో అధిక డిమాండ్ ఉన్న ఫోన్‌గా నిలుస్తోంది.అందుబాటులో ఉన్న ప్రస్తుత తగ్గింపులతో, వారి స్మార్ట్‌ఫోన్లను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఈ డిస్కౌంట్ గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.

ఐఫోన్ 14 HDR మద్దతుతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 1200-నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, ఫేస్ ID సెన్సార్లు, 4జీబీ ర్యామ్ + 128జీబీ/ 256జీబీ/ 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది.కనెక్టివిటీ పరంగా, ఐఫోన్ 14 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్‌కు మద్దతు ఇస్తుంది.

Advertisement

ఛార్జింగ్ కోసం లైట్నింగ్ పోర్ట్‌ను ఆఫర్ చేస్తుంది.డ్యూయల్-కెమెరా సిస్టమ్ f/1.5 ఎపర్చరు, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో ప్రైమరీ 12MP వైడ్-యాంగిల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!
Advertisement

తాజా వార్తలు