యాదాద్రి భువనగిరి జిల్లా: సామాజిక సమస్యలపై కార్మికవర్గ దృక్పథంతో ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు.యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్ఎంఎల్ఎస్ ఫంక్షన్ హాల్ లో శనివారం సిఐటియు జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఉత్సాహపూరితంగా ప్రారంభమయ్యాయి.
శిక్షణా తరగతుల ప్రారంభ సూచికగా జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు సిఐటియు జెండాను ఆవిష్కరించారు.అనంతరం అమరవీరులకు జోహార్లు అర్పించారు.
శిక్షణా తరగతులకు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణా తరగతులను ప్రారంభించి,”సామాజిక సమస్యలు – కార్మికవర్గ దృక్పథం” అనే అంశంపై క్లాస్ బోధించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అనాదిగా వస్తున్న అంతరాలను రూపు మాపేందుకు కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలన్నారు.
కులం,మతం,అంతరాల పేరుతో కార్మికులను పాలకవర్గాలు,పెట్టుబడిదారులు విచ్చిన్నం చేసి ఆర్థిక,శ్రమ దోపిడి చేస్తున్నాయన్నారు.
సమాజంలో శ్రమ పాత్ర కీలకమైనది శ్రమకు తగిన ప్రతిఫలం కోసం సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక కార్మిక ఉద్యమాలు జరిగాయన్నారు.ప్రభుత్వాలు మారుతున్నా కార్మికులపట్ల దోపిడి పలు రూపాల్లో పెరుగుతుందన్నారు.
శ్రామిక మహిళలపై పని ప్రదేశాల్లో జరిగే వేధింపులు, పురుషాధిపత్యంపై చైతన్యంతో పోరాటం నడపాలన్నారు.ఈ కార్యక్రమంలో శిక్షణా తరగతుల ఆహ్వాన సంఘం చైర్మన్ తిరుగుడు మళ్ళికార్జున్,రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి,సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు దోనూరి నర్సిరెడ్డి,యండి పాష,గొరిగె సోములు,తుర్కపల్లి సురేందర్,సహాయ కార్యదర్శులు బోడ భాగ్య, మాయ కృష్ణ,పుప్పాల గణేష్, సుబ్బూరి సత్యనారాయణ, అంగన్ వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రమా కుమారి,వ్య.
కా.స జిల్లా సహాయ కార్యదర్శి జల్లల పెంటయ్య,జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం,గ్రామ పంచాయతీ,భవన నిర్మాణ, హమాలి,ట్రాన్స్ పోర్ట్,అంగన్ వాడీ,ఆశా,ఎఎన్ఎం, మధ్యాహ్న భోజన,మిషన్ భగీరథ కంపనీ వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.