పండుగల సీజన్ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు కూడా ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లు షురూ చేశాయి.ఈ క్రమంలో ఏకంగా రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ డిస్కౌంట్లు ఇస్తుండడం గమనార్హం.కారు ఎవరికి అవసరం లేదు.దానిని మెంటైన్ చేసే సత్తా వుండాలే కానీ ఇక్కడ ప్రతి ఒక్కడికీ సౌకర్యం కావాలి.అవును, ఒక కుటుంబం ప్రయాణం సుఖంగా జరగాలి అంటే ఇపుడు కారు అనేది చాలా అవసరం.మరీ ప్రత్యేకించి ఎస్‌యూవీ( SUV ) కార్లపై మోజు పెంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే పండుగల సీజన్ ప్రారంభం కావడంతో కొత్తగా కారు కొనాలని భావించే వారికి ఆటోమొబైల్ సంస్థలు తీపి కబురు అందించాయి.

ఆ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్, లాయాల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు వంటివి ఉన్నాయి.ఈ నెలాఖరు వరకూ ఈ డిస్కౌంట్లు లభిస్తాయి.కంపాక్ట్ హ్యాచ్ బ్యాక్, సెడాన్ మోడల్( Compact hatchback, sedan model ) కార్లు మొదలు ఎస్‌యూవీలు, సీఎన్జీ వేరియంట్ల వంటి అత్యంత గిరాకీ ఉన్న మోడల్ కార్లపై డిస్కౌంట్లు ఎక్కువగా వున్నాయి.ఈ క్రమంలోనే మారుతి సుజుకి తన ఆల్టో, వ్యాగన్ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో ( Alto, WagonR, Celerio, S-Presso )మోడల్ కార్లపై ఏకంగా రూ.61 వేలు, స్విఫ్ట్ మోడల్‌పై రూ.54 వేల డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది.అయితే అన్ని మోడల్ కార్లకు డిస్కౌంట్లు వర్తించబోవని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.

ఇక టాటా మోటార్స్ విషయానికొస్తే… నెక్సాన్, సఫారీ, హారియర్ ( Nexon, Safari, Harrier )మోడల్ కార్లను అప్ డేట్ చేసింది.ఈ నేపథ్యంలో పాత మోడల్ కార్లపై రూ.1.40 లక్షల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండడం విశేషం.ఇక హ్యుండాయ్ మోటార్ ఇండియా తన కార్లపై రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ డిస్కౌంట్లు అందిస్తున్నది.అదేవిధంగా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ఎక్స్‌యూవీ300పై రూ.90 వేలు, బొలెరోపై రూ.70 వేలు, మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీపై రూ.1.25 లక్షలు, బొలెరో నియోపై రూ.50 వేలు డిస్కౌంట్ ప్రకటించడం విశేషం.దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో పది లక్షల కార్లు అమ్ముడవుతాయని ఆటోమొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.







