ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ( Mylavaram ) టీడీపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.నియోజకవర్గ టికెట్ కోసం దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్( MLA Vasantha Krishna Prasad, Devineni Uma ) పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలోనే టికెట్ తనకేనంటూ వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు.ఇందులో భాగంగా మండల స్థాయి నేతలకు వసంత కృష్ణప్రసాద్ టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది.
అయితే అభ్యర్థిని తానేనని చెబుతున్న వసంత కృష్ణప్రసాద్ ఇంకా టీడీపీ(TDP )లో చేరలేదు.ఈ క్రమంలోనే మరో రెండు రోజుల్లో టీడీపీ కండువా కప్పుకుంటానని వసంత కృష్ణప్రసాద్ చెబుతున్నారు.మరోవైపు దేవినేని ఉమా పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu )తో సమావేశం అయ్యారు.ఈ క్రమంలోనే మైలవరం టికెట్ తనకే ఇవ్వాలంటూ దేవినేని కోరారని తెలుస్తోంది.
అయితే పార్టీ హైకమాండ్ వీరిలో ఎవరికీ టికెట్ కేటాయిస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.