కేరళకి చెందిన రంజీ ట్రోఫీ మాజీ క్రికెటర్ ఎం సురేష్ కుమార్ శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.తన తండ్రి సురేష్ కుమార్ పడకగదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనితో పోలీసులు వెంటనే వచ్చి సురేష్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అన్న కోణంలో విచారణ మొదలుపెట్టి , పోస్టుమార్టం కోసం అయన మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
అల్లప్పుజా నగరానికి చెందిన సురేష్ కుమార్ 1991 నుంచి 2006 వ సంవత్సరం వరకు 72 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు , అందులో 196 వికెట్లు పడగొట్టి, 1657 పరుగులు తీశారు.
రైల్వే శాఖలో పనిచేస్తున్న సురేష్ కేరళలో 52 క్రికెట్ మ్యాచ్ లలో ఆటగాడిగా ఉన్నారు.అలాగే , దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కు సురేష్ ప్రాతినిథ్యం వహించారు.
1994-95లో తొలి రంజీ ట్రోఫీ కేరళ గెలిచింది.ఈ టోర్నీని గెలవడంలో సురేష్ కుమార్ కీలక భూమిక పోషించారు.తమిళనాడు జట్టుపై కేరళ గెలిచింది.164 పరుగులిచ్చిన సురేష్ కుమార్ 12 వికెట్లు తీశాడు.2005లో రంజీకి వీడ్కోలు పలికాడు.పాలక్కడ్ లో జార్ఖండ్ జట్టుతో జరిగిన మ్యాచులో చివరిసారిగా ఆడాడు.రిటైర్మెంట్ అనంతరం ఇండియన్ రైల్వేస్‌లో పనిచేశాడు .1992లో అండర్ -19 టెస్ట్ ఓడీఏ జట్టులో స్థానం పొందిన సురేష్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం అలముకుంది.ఇతని ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.
.






