చిన్నప్పుడు చరణ్ ను ఎత్తుకొని ఆడించేదాన్ని.. బాగా అల్లరి చేసేవాడు.. రోజా షాకింగ్ కామెంట్స్!

సినీ నటి, మాజీ మంత్రి, వైకాపా ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ( Roja ) రాజకీయాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

అయితే ప్రస్తుతం వైకాపా పార్టీ ( YCP )ఘోర పరాజయం అయినప్పటికీ ఈమె మాత్రం తగ్గేదే లేదు అనే విధంగా సోషల్ మీడియా వేదికగా మీడియా సమావేశాలలో కూడా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాజకీయాల పరంగా బిజీగానే ఉన్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయ విషయాలు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

Ex Minister Rk Roja Sensational Comments On Ramcharan , Ram Charan, Roja,rrr Mov

ఇలా సినిమాల ప్రస్తావన రావడంతో ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల పరంగా నాకు మెగా కుటుంబానికి మధ్య ఎన్నో విభేదాలు ఉండవచ్చు కానీ సినిమాల పరంగా మా మంచి వాతావరణమే ఉంది అంటూ రోజా తెలిపారు.ఇక రామ్ చరణ్ ( Ramcharan ) గురించి ఈమె మాట్లాడుతూ చరణ్ చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు స్కూల్ కి వెళ్ళిన తర్వాత కాస్త అల్లరి తగ్గిందని రోజా తెలిపారు.

ఇక ముఠామేస్త్రి సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతున్న సమయంలో ఓసారి చిరంజీవి( Chiranjeevi ) చరణ్ ని తీసుకుని  వచ్చారు.

Ex Minister Rk Roja Sensational Comments On Ramcharan , Ram Charan, Roja,rrr Mov
Advertisement
Ex Minister Rk Roja Sensational Comments On Ramcharan , Ram Charan, Roja,RRR Mov

ఆ సమయంలో షూటింగ్ పూర్తికాగానే చరణ్ ని ఎత్తుకొని బాగా ఆడించేదాన్ని.బాగా అల్లరి చేసేవాడు అంటూ చరణ్ గురించి ఈమె కామెంట్ చేశారు.ఇక చరణ్ డాన్స్ చేస్తే కొన్నిసార్లు వాళ్ల నాన్నగారే తనలో కనిపిస్తారని రోజా తెలిపారు.

ఇక చరణ్ ఇటీవల నటించిన RRR సినిమా తనకు చాలా బాగా నచ్చిందని ఆ సినిమాలో చరణ్ ఓపెనింగ్ షాట్ అందరి పైకి అలా దూకుతూ వచ్చి కొట్టే సన్నివేశం తనకు బాగా నచ్చింది అంటూ రోజా చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయిఇక ఈమె మాటలు విన్న అభిమానులు అదేంటి రోజా ఒక్కసారిగా ఇలా యూటర్న్ తీసుకొని మెగా వారసుడి పై ప్రశంసలు కురిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు