తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఒకరు విక్టరీ వెంకటేష్ ( Victory Venkatesh ).ఈయనకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందంటే, ఏ హీరో అయిన ఫ్యామిలీ ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకుంటే , ఆ హీరో క్రేజ్ ని కొలవడానికి వెంకటేష్ ని ఒక బ్యారోమీటర్ గా ఎంచుకుంటారు.
ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వెంకటేష్ , వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అనే రేంజ్ ఇంప్యాక్ట్ ని క్రియేట్ చేసుకున్నాడు.ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం లో అయినా, సెంటిమెంట్ తో కన్నీళ్లు రప్పించాలన్నా, మాస్ ఆడియన్స్ ని తన కటౌట్ తో అద్భుతమైన ఫైట్స్ చేసి వాళ్ళని సంతృప్తి పరచాలన్నా వెంకటేష్ కి కొట్టినపిండి లాంటిది.
అందుకే కొత్త జనరేషన్ స్టార్ హీరోలు వచ్చినా, వెంకటేష్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఇంచు కూడా తగ్గలేదు, టాక్ వస్తే కుటుంబం మొత్తం ఆయన సినిమాలకు క్యూ కడుతారు.

అంటే కాదు నేటి తరం లో మల్టీస్టార్ర్ర్ సినిమాలకు తెరలేపిన హీరో కూడా వెంకటేష్ మాత్రమే.సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆయన కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా తర్వాతే టాలీవుడ్ లో మల్టీస్టార్ర్ర్ సినిమాల జోరు ఊపందుకుంది.
ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ కి అర్జున్( Arjun ) అనే కొడుకు ఉన్నాడనే విషయం మన అందరికీ తెలిసిందే.ఈయనకి ఇప్పుడు 18 ఏళ్ళు నిండాయట.
ప్రస్తుతం విదేశాల్లో పై చదువులు చదువుతున్న ఈయన అతి త్వరలోనే హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి.
అర్జున్ దగ్గుపాటి ని చూస్తుంటే దగ్గుపాటి కుటుంబం లోనే అందగాడు లాగ అనిపిస్తున్నాడు.దగ్గుపాటి రానా పెళ్లి సమయం లో అర్జున్ దగ్గుపాటి ని చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

అయితే అర్జున్ దగ్గుపాటి మొదటి చిత్రానికి ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నాడని టాక్.ఇప్పటికే ఒక అద్భుతమైన స్టోరీ అన్నీ వర్గాలకు నచ్చే ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథని రెడీ చేసాడట త్రివిక్రమ్.ఆ కథ వెంకటేష్ కి ఎంతగానో నచ్చింది.వచ్చే ఏడాది లోనే అర్జున్ గ్రాండ్ డెబ్యూ ఉండే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.
ఇక వెంకటేష్ గత ఏడాది వెండితెర ఆడియన్స్ ని F3 సినిమాతో, ఈ ఏడాది ‘రానా నాయుడు’( Rana Naidu ) తో ఓటీటీ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ రెండు సినిమాల తర్వాత ఆయన శైలేష్ తో ‘సైన్డవ్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.
ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతుంది.







