చెన్నై లో దివ్యాంగ విద్యార్థి ఫై ప్రశంశల వర్షం?

మనలో చాలా మంది పల్లెల్లో వరినాట్లు చూసి ఉంటాం.వాటి గురించి వినే ఉంటాం.

కానీ ఆ పని చేయాలి అంటే ఎంతో మందికి చాలా ఆనందం.నిరంతరం అలా వరి నాట్లు వేస్తూ కలుపు తీయడం అంటే చాలా కష్టం సహజంగా వరి నాట్లు వేయాలి అంటే కొంచెం కష్టం.

కానీ తల పైన కరగం పెట్టుకొని వరి నాటు వేయడం అంటే మాటలు కాదు.కానీ తలపై కరగం పెట్టుకొని వరి నాట్లు వేసిన దృశ్యం మనకు చెన్నై లో కనిపిస్తోంది.

చెన్నైలోని ఆరియలూరు జిల్లా,ఉడయార్ పాలయం సమీపంలోనే పెరిమతి కోణం గ్రామానికి చెందిన పాండియన్ మాల దంపతులకు 15 సంవత్సరాలు వయస్సు గల కృష్ణవేణి కూతురు ఉంది.ఈ అమ్మాయి కృష్ణవేణి జయం కొండా లో ఉన్న బధిరుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.

Advertisement

ఈ కృష్ణవేణి తలపై కరగం పెట్టుకుని వరినాట్లు వేసింది.ఇలా నాట్లు వేసిన దివ్యాంగ విద్యార్థి ని గ్రామస్తులు తల్లిదండ్రులు ప్రశంసించారు.

వ్యవసాయాన్ని కాపాడుకోవాలని అంతరిస్తున్న ప్రాచీన కళా రూపం కరగాట్టం ను ఆదరించాలని తపనతో కృష్ణవేణి తలపై కరగం ఉంచుకొని పొలంలో దిగి వరి నాట్లు వేసింది.గంటకుపైగా కరగాటం ఆడుతూ వరి నాట్లు వేసింది.

వరి నాట్లు వేసిన కృష్ణవేణి ఫై రైతులు, తల్లిదండ్రులు ప్రశంసల వర్షం కురిపించారు.ఈ విషయంపై తన తల్లి మాల ఇలా చెప్పింది.

వ్యవసాయ పరిరక్షణ కరగాట్టం కు ఇలాంటి ప్రాచీన కళలను మరచిపోకూడదు అన్న విషయాన్ని తెలపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కృష్ణవేణి.ఈ దృశ్యాలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపిస్తామని తెలిపారు మాల.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు