కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.ముఖ్యమంత్రి అభ్యర్థిగా డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
కన్నడలో అధికారంలోకి తెచ్చేందుకు శివకుమార్, సిద్ధరామయ్యలు కీలక పాత్రలను పోషించారు.ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎవరికీ అధికార పీఠాన్ని అప్పగిస్తుందనే విషయం హాట్ టాఫిక్ గా మారింది.
ఇప్పటికే ఇరువురు నేతలతో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమావేశమైయ్యారు.తరువాత ఆయన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశం కానున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం బెంగళూరులో నిర్వహించే సీఎల్పీ సమావేశానికి ముందే సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.