హైవే, ఎక్స్‌ప్రెస్ మధ్య గల తేడా ఎపుడైనా గుర్తించారా?

హైవే, ఎక్స్‌ప్రెస్ఈ పదాలను మనం తరచూ వింటూ ఉంటాం.ఈ పదాలను వినగానే మనకు విశాలమైన రోడ్స్ గుర్తుకు వస్తాయి.

 Ever Notice The Difference Between Highway And Express Highway, Express, Journey-TeluguStop.com

ఇక ప్రపంచంలోని ఏ దేశ ఆర్థిక వ్యవస్థను అంచనా వేయాలనుకున్నా ముందుగా ఆ దేశ రహదారులను గమనిస్తే తెలిసిపోతుంది అనే నానుడి వుంది.అది నిజమే.

ఏ దేశంలో రోడ్లు మెరుగ్గా ఉన్నాయో అక్కడి ఆర్థిక వ్యవస్థ కూడా బాగుందని భావిస్తారు.అలా దేశ ప్రగతిని చాటిచెప్పే 2 రకాల రోడ్ల పేరే ఒకటి హైవే( Highway ), మరొకటి ఎక్స్‌ప్రెస్ వే.ఈ రెండూ రోడ్లే.కానీ అవి ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల( Express ) సంఖ్య మొత్తం 23.అదే విధంగా హైవేల సంఖ్య మొత్తం 599.ఈ రహదారుల మొత్తం పొడవు దాదాపు 1.32 లక్షల కిలోమీటర్లు.వీటిలో జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 దేశంలోని అత్యంత పొడవైన రహదారి అనే సంగతి మీకు తెలిసినదే.దీని మొత్తం పొడవు 3745 కిలోమీటర్లు.

ఈ రహదారి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి( kanyakumari ) వరకు వెళుతుంది.ఈ ఎక్స్‌ప్రెస్‌వే అనేది హై లెవెల్‌లో నిర్మితమయ్యింది.

ఇది 6 నుండి 8 లేన్‌లను కలిగి ఉంది.హైస్పీడ్ ట్రాఫిక్ కోసం ఎక్స్‌ప్రెస్‌వేలు తీర్చిదిద్దారు.

ద్విచక్ర వాహనాలతో సహా స్లో స్పీడ్ వాహనాలను వీటిపైకి అనుమతించరు.

ఎక్స్‌ప్రెస్‌వే కోసం ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ర్యాంప్‌లు అనేవి ఉంటాయి.దీనిపై ప్రయాణించేవారు కొన్ని నియమిత ప్రదేశాల నుండి మాత్రమే బయటకు రాగలరు.అదే హైవే అనేది కొన్ని పెద్ద నగరాలు లేదా గ్రామాలను మాత్రమే కలుపుతుంది.

ఇది 2 లేదా 4 లేన్లతో కూడిన పెద్ద రహదారి అని చెప్పుకోవచ్చు.భారీ వాహనాలతో పాటు చిన్నపాటి వాహనాలైన బైక్స్, ఆటో రిక్షాలు దీని మీద నడుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube