టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి, హీరో ఎన్టీఆర్ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సొంతం చేసుకున్నాయి.
ఇకపోతే తాజాగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర.ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో విడుదల కానుంది.
ఈ క్రమంలోనే తెలుగులో ఈ సినిమాని రాజమౌళి సమర్పణలో విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమా 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సెప్టెంబర్ రెండవ తేదీ ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దయింది.
ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నాం అయితే కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం రద్దయిందని తెలిపారు.

ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ మంటను తన చేతినుంచే విసిరే అద్భుత శక్తిని కలిగి ఉంటారు.ఈ క్రమంలోనే ఈ వేడుకలో కూడా భారీ ఫైర్ వర్క్ ప్లాన్ చేసాం కానీ వర్కౌట్ కాలేకపోయిందని తెలిపారు.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రానున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను రణబీర్ కపూర్ తోడగొట్టు చిన్న అని చెప్పగానే ఎన్టీఆర్ తోడకొట్టేలా ప్లాన్ చేసాము.ఇలా ఎన్టీఆర్ తొడకొట్టే సమయంలో ఫైర్ వచ్చేలా ప్లాన్ చేశామని జక్కన్న ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ గురించి ఎన్నో ప్లాన్స్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదని ప్రెస్ మీట్ లో రాజమౌళి వెల్లడించారు.ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్ మౌని రాయ్ నాగార్జున వంటి వాళ్ళు నటించగా ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీ విడుదల కానుంది.







