కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని శత విధాల ప్రయత్నాలు చేస్తున్న వేళ తాజాగా కొంతమంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ విడుదల చేసిన ఫస్ట్ లిస్టులోని నియోజకవర్గాల్లో ఎలాంటి అల్లర్లు గొడవలు లేవని అలాగే ఈ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో మంచి గుర్తింపు ఉండడం వల్ల వీరికి ఆ స్థానం కన్ఫర్మ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే దాదాపు ఇంకో 60కు పైగా సీట్లు బ్యాలెన్స్ ఉన్నాయి.ఇక ఈ 60కి పైగా సీట్లలో నాయకుల మధ్య పోటీ తత్వం, గొడవలు, అల్లర్లు అనేవి ఉన్నాయి.
ఇక ఈ నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట ఇద్దరు ముగ్గురు పోటీ ఉన్నారు.
వారిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక పార్టీ అధిష్టానం అయోమయంలో పడిపోయింది.
ఇక బిఆర్ఎస్ (BRS) పార్టీ ఇప్పటికే బీఫామమ్స్ సైతం ఇచ్చేసి ప్రచారాలు చేసుకోమని పిలుపునిస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢిల్లీ నేతల చుట్టూ తిరుగుతూ ఢిల్లీలో కాలక్షేపాలు చేస్తున్నారు.ఇక ఇప్పటికే బస్సు యాత్ర( Bus Yatra ) ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
బస్సు యాత్ర ఆలోచన బాగానే ఉన్నప్పటికీ చాలామంది నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియక అయోమయం లో ఉన్న నేపథ్యంలో అసలు పార్టీ తరపున ప్రచారం చేయాలా వద్దా అని అనుమాన పడుతున్నారట.
ఎందుకంటే ఒకవేళ తమకి పార్టీలో టికెట్ రాకపోతే ఎలాగైనా ఈ పార్టీలో ఉండబోమని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారట.అలాగే ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఆరు పథకాలు గ్యారెంటీ అని ఒక చిన్న పాటి మేనిఫెస్టో( Manifesto ) కూడా రిలీజ్ చేశారు.అయితే ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఎవరూ కూడా ప్రజల్లోకి ఈ ఆరు గ్యారెంటీ పథకాలను తీసుకువెళ్ల లేకపోయారు.
బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ (KCR) బహిరంగ సభలు పెడుతూ బిజీ బిజీగా ఉంటే కాంగ్రెస్ లో మాత్రం ఇంకా టికెట్ కోసం కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి.ఇక తాజాగా తెరపై మరో కొత్త ప్రచారం జరుగుతుంది.అదేంటంటే కాంగ్రెస్ లో గెలుపు గుర్రాలు అని ఇప్పటికే కొంతమందిని ప్రకటించారు.కానీ వారు కాంగ్రెస్ తరపున గెలిచిన కూడా లాభం లేదన్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పటికే చాలామంది గత ఎన్నికల్లో గెలిచి మళ్ళీ కోవర్టుల ద్వారా ఇతర పార్టీలలోకి జంప్ అయ్యారు.
అయితే ఈసారి కూడా కాంగ్రెస్లో గెలిచిన చాలామంది అభ్యర్థులు ఇతర పార్టీలలోకి జంప్ అవుతారు అని తెలుస్తోంది.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మెజారిటీ స్థానంలో గెలిస్తే తప్ప అటు ఇటుగా ఉంటే మాత్రం కచ్చితంగా ఇతర పార్టీ వాళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారని, ఎన్నికల్లో గెలిచినా కూడా లాభం లేదు అని,కార్యకర్తల శ్రమ మొత్తం ఉత్తదే అవుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.