సెట్లో ఏం జరుగుతుందో పవన్ కి తప్ప ఇంకెవరికి తెలియదా ?

పవన్ కళ్యాణ్ కి సినిమా కథ, దర్శకత్వం లాంటి విషయాల్లో తలదూర్చే అలవాటు ఉందని అంటుంటారు చాలామంది.అసలు సర్దార్ గబ్బర్ సింగ్, కథ, స్క్రీన్ ప్లే వరకే కాదు, సినిమాని ఎక్కువగా డైరెక్ట్ చేసింది పవనే అనే రూమర్ కూడా ఉంది.

 Even Actors Don’t Know Who Is The Writer Of Katamarayudu-TeluguStop.com

ఇప్పుడు కాటమరాయుడు విషయంలో కూడా పవన్ ఇంవాల్వ్ మెంట్ అవసరానికి మించి ఉంటోదనే వార్తలు వస్తున్నాయి.

కాటమరాయుడు సెట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, ఆ సినిమా రచయిత ఎవరో అనే విషయం కూడా సెట్లో జనాలకి సరిగా తెలియదంట.

ఆ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న శివబాలాజికి కూడా ఈమధ్యే రచయిత ఎవరో, ఎవరు కాదో పట్టుబట్టి తెలుసుకుంటే తప్ప తెలియలేదట.అదీకూడా ఆకుల శివ ఈ సినిమాకి రచయిత కాదని తెలుసుకోవడానికి ఓ రెండు రోజులు పట్టిందట.

ఈరకంగా సెట్లో ఎవరు రచయితో, డైరెక్ట్ చేస్తున్నది కిషోరో లేక పవనో కూడా అర్థం కావట్లేదని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిన్నాయి.ఓ దర్శకుడు మారాడు, ఓ సినిమాటోగ్రాఫర్ మారాడు, ఓ రచయిత కూడా మారాడు .ఇంతకి కాటమరాయుడు సెట్లో ఏం జరుగుతోంది?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube