28 బంతుల్లో సెంచరీ చేసి పెను విధ్వంసం..!

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ అనామక బ్యాట్స్‌మెన్ భీక‌ర‌మైన ఇన్నింగ్సు ఆడాడు.కేవ‌లం 28 బంతుల్లోనే సెంచరీ బాది చ‌రిత్ర సృష్టించాడు.

అత‌డి ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉండ‌టం విశేషం.యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టు తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన 32 ఏళ్ల అహ్మద్ ముస్సాదిక్ టిహెచ్‌సిసి హాంబర్గ్‌ జట్టుపై వీరవిహారం చేశాడు.

కేవ‌లం 33 బంతుల్లో 115 పరుగులు సాధించాడు.ముస్సాదిక్ విజృంభ‌ణ‌తో కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టు కేవ‌లం 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.

ముస్సాదిక్ 13 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేసి త‌ర్వాతి 15 బంతుల్లో సెంచ‌రీ మార్కు చేరుకుని కేవ‌లం 28 బంతుల్లో శ‌త‌క‌బాది ఇన్నింగ్స్ చివ‌రి బంతికి పెవిలియ‌న్ చేరాడు.అనంత‌రం 199 పరుగలు లక్ష్య‌చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన టిహెచ్‌సిసి హాంబర్గ్ జ‌ట్టు 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 53 పరుగులు మాత్రమే చేసి ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది.

Advertisement

మ్యాచ్‌లో ముస్సాదిక్‌ తొలి బంతి నంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా బంతి బాదడమే లక్ష్యంగా పెట్టుకుని, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

అనంతరం 199 పరుగలు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 53 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో ముస్సాదిక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 145 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.అహ్మద్ ముసాదిక్ యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని 28 బంతుల్లో సాధించాడు.

అంతకముందు ఈ రికార్డు భారత సంతతికి చెందిన బ్యాట్స్‌మెన్ గౌహర్ మనన్ పేరిట ఉంది.ఆయన పేరిట 29 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు ఉంది.క్లౌజ్ క్రికెట్ క్లబ్‌పై గౌహర్ ఈ రికార్డు నెలకొల్పాడు.32 ఏళ్ల అహ్మద్ మొదటి బంతి నుండే బౌలర్లపై ఎటాకింగ్‌కు దిగడంతోనే ఈ సెంచరీ సాధ్యమైందని తెలిపారు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు