భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి.. ప్రమాణం చేయించిన కమలా హారిస్..!!

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి( Eric Garcetti ) ప్రమాణం చేశారు.వాషింగ్టన్‌లో ( Washington ) శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు , భారత సంతతికి చెందిన కమలా హారిస్( Vice President Kamala Harris ) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

 Eric Garcetti Sworn In As Us Ambassador To India By Vice President Kamala Harris-TeluguStop.com

దీంతో దాదాపు రెండేళ్ల నిరీక్షణకు తెరపడినట్లయ్యింది.అనంతరం కమలా హారిస్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘‘గార్సెట్టి నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడని, భారత ప్రజలతో అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు’’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల విభాగాలు కూడా గార్సెట్టికి అభినందనలు తెలియజేశాయి.

భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదం లభించగా.ఇండియా ఇప్పటికే స్వాగతించింది.

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి అతనితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టిని రెండేళ్ల క్రితమే జో బైడెన్ నామినేట్ చేశారు.

అయితే రిపబ్లికన్ సెనేటర్ మార్క్ రూబియో అభ్యంతరం తెలపడంతో కాంగ్రెస్‌లో చర్చ వాయిదాపడుతూ వస్తోంది.లాస్ ఏంజెల్స్ మేయర్‌గా వున్న సమయంలో గార్సెట్టి తన కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రూబియో సహా కొందరు సెనేట్ సభ్యులు ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో గార్సెట్టిని మరోసారి భారత్‌లో అమెరికా రాయబారి పదవికి నామినేట్ చేశారు జో బైడెన్.

Telugu America, Eric Garcetti, India, Joe Biden, Kamala Harris, Washington-Telug

ఇకపోతే.ఎరిక్ గార్సెట్టికి డెమొక్రాట్లలో సమర్థుడైన నేతగా పేరుంది.మూడు దశాబ్ధాల తర్వాత వేసవి ఒలింపిక్స్‌ను అమెరికా గడ్డపైన తిరిగి నిర్వహించేందుకు ఆయన చేసిన ప్రయత్నం విజయవంతమైంది.

దేశంలో అత్యంత రద్దీగా వుండే రెండో ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ అయిన లాస్ ఏంజిల్స్ మెట్రోకు గార్సెట్టి అధ్యక్షత వహిస్తున్నారు.దీనిలో కొత్తగా 15 లైన్లను నిర్మిస్తున్నారు.అంతేకాకుండా పారిస్ వాతావరణ ఒప్పందాన్ని అమెరికాలోని 400 మంది మేయర్లు పాటించే విధంగా ఏర్పాటు చేసిన ‘‘ క్లైమేట్ మేయర్‌’’కు కో ఫౌండర్‌గా ఎరిక్ వ్యవహరిస్తున్నారు.

Telugu America, Eric Garcetti, India, Joe Biden, Kamala Harris, Washington-Telug

యూఎస్ నేవీ రిజర్వ్ కాంపోనెంట్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా 12 ఏళ్లపాటు పనిచేసిన గార్సెట్టి.2017లో లెఫ్టినెంట్‌గా రిటైర్ అయ్యారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు.

యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు.ఎరిక్‌. 2013 నుంచి లాస్ ఏంజెల్స్ మేయర్‌గా, 12 ఏండ్లపాటు సిటీ కౌన్సిల్‌ సభ్యులుగా పనిచేశారు.భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్‌ తనకు అత్యంత నమ్మకస్తుడైన ఎరిక్‌ను రాయబారిగా నామినేట్‌ చేశారని శ్వేతసౌథం అప్పట్లో తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube