కూటములకు సమ దూరం -టిడిపికి తత్వం బోధపడిందా?

రెండు కళ్ళ సిద్ధాంతాలు, రాజకీయ లౌక్యాలు అన్నవి అన్నీ సందర్భాల లోనూ పనికిరావు, కొన్నిసార్లు ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.ఇప్పటివరకు చంద్రబాబు( Chandrababu Naidu ) తన రాజకీయ జీవితంలో అత్యధిక సమయం ఇలా కర్ర విరగకుండా పాము చావకుండానే నడిపించారు.

 Equal Distance To Alliances - Has Philosophy Taught Tdp, Tdp, Bjp , Ap Politics-TeluguStop.com

అది కొన్నిసార్లు మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కొన్నిసార్లు మాత్రం దారుణంగా వికటించింది .ముఖ్యంగా తెలంగాణపై రెండు కళ్ళు సిద్ధాంతాన్ని ప్రకటించిన చంద్రబాబు ఏ రకమైన ప్రయోజనాలను దక్కించుకోకపోగా తెలంగాణ ఏర్పాటు తర్వాత పూర్తిస్థాయిలో టిడిపి పార్టీ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది.ఇప్పుడు ఎన్డీఏతో పొత్తు వ్యవహారం లో కూడా నాన్చుడు ధోరణి సరికాదని అసలు బి‌జే‌పి వైపు నుండి ఈ సంకేతాలు రానప్పుడు ఇంకా చూరు పట్టుకుని వేలాడినట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదని టిడిపి( TDP ) అధినాయకత్వం గ్రహించినట్లే ఉంది.

Telugu Ap, Chandra Babu, Lokesh, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

ఇప్పుడు భాజపాతో పొత్తుపై సమయం వచ్చినప్పుడు చూద్దాం అన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది .ప్రస్తుతాని రెండు కూటము లతో సమాన దూరంగా ఉన్నామని లోకేష్( Nara lokesh ) ఢిల్లీ మీడియాతో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇది ఒకరకంగా డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి ముఖ్యంగా పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి ప్రకటన ఇవ్వడం ప్రస్తుతానికి కొంత ఇబ్బంది అయినప్పటికీ కార్యకర్తల మనోభావాల దృష్ట్యా చూసినప్పుడు ఇదే కరెక్ట్ స్టాండ్ అని కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం జనసేన తెలుగుదేశం కూటమి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో కొలువుతీరే పార్టీకి తమ మద్దత్తు అవసరం అవుతుందని అప్పుడు తమ పార్టీ ప్రయోజనాలను రాష్ట్ర ప్రయోజనాలను ముడిపెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం తెలివైన ఎత్తుగడ తప్ప ప్రతిదానికి కేంద్రం దగ్గర సాగిలపడే ధోరణి దీర్ఘకాలం రాజకీయంగా అంత మంచిది కాదన్నది రాజకీయ పరిశీలకుల వాదన.ఇప్పటికైనా తెలుగుదేశం ముందుకొచ్చి బలమైన నిర్ణయాలు తీసుకోవటం ఆ పార్టీకి ఎదుగుదలకు మంచిదే అన్నది మెజారిటీ విశ్లేషకులు వాదన.

Telugu Ap, Chandra Babu, Lokesh, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

నెల రోజుల జైలు జీవితం చంద్రబాబుకు తత్వం బోధపడేలా చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి .అయితే జనసేనతో( Jana sena ) సీట్ల సర్దుబాటు అధికార సర్దుబాటు అన్నది ఇప్పుడు తెలుగుదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా మారింది.ముఖ్యంగా జనసేనకు బలమైన మద్దతు ఇస్తున్న కాపు సామాజిక వర్గం అధికారం లో వాటా బలం గా కోరుకోవడం తో ఒకవేళ అది ప్రకటించకపోతే పొత్తు వికటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.మరోవైపు అధికార వైసిపి అన్ని రకాల గాను ఎన్నికలకు సిద్ధమవుతున్న వాతావరణం కనిపిస్తున్న దరిమిలా పొత్తును సక్రమంగా వికసింప చేసుకోకపోతే మాత్రం దాన్ని ఫలితాలు ఈ కూటమి పూర్తిస్థాయిలో దక్కించుకోలేదు అన్నది మాట మాత్రం వాస్తవం అనే చెప్పాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube