EPFO లో 2859 పోస్టులకు నోటిఫికేషన్.. వయో పరిమితి, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు..!

EPFO లో 2859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మార్చి 27న ప్రారంభమై ఏప్రిల్ 26న ముగియనుంది.

 Epfo Recruitment Notification 2023 For 2859 Posts Full Details-TeluguStop.com

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్( Social Security Assistant ) పోస్టులు-2674
స్టెనోగ్రాఫర్ ( Stenographer ) పోస్టులు- 185
సోషల్ సెక్యూరిటీ పోస్టులు తెలంగాణ-116
సోషల్ సెక్యూరిటీ పోస్టులు ఆంధ్ర ప్రదేశ్-39

ఈ ఉద్యోగాల దరఖాస్తు EPFO యొక్క అధికారిక వెబ్ సైట్ epfindia.gov.in లో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాలి.

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పట్టభద్రులు అయి ఉండాలి.స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఇంగ్లీషు లేదా హిందీ లో నిమిషానికి 35 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి.

స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి నిమిషానికి 80 పదాల డిక్టేషన్ మరియు టైపింగ్ వేగం కలిగి ఉండాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్యన ఉండాలి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితి( Age Limit ) సడలింపు ఉంటుంది.రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, స్టెనో స్కిల్ టెస్ట్ లద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.29,200 నుండి రూ.92,300 వరకు పొందుతారు.స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.25,500 నుండి రూ.81,100 వరకు పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube