వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి ఎన్క్వాస్ సర్టిఫికేట్

అత్యుత్తమ వైద్య సేవలు అందించడం, విభాగాల మెరుగైన నిర్వహణకు గానూ గుర్తింపు హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆసుపత్రికి వచ్చే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం, ఆసుపత్రిలోని అన్ని విభాగాల మెరుగైన నిర్వహణకు గానూ వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం నుండి శుక్రవారం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) సర్టిఫికెట్ అందింది.

కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు, వసతులతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు.

కేంద్ర బృందం గత సంవత్సరం అక్టోబర్ లో వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించగా, ఫార్మసీ, ఓపీడీ, అడ్మిన్, రేడియాలజీ, ఎమర్జెన్సీ, ఆక్సిలరీ సర్వీసెస్, ఐపీడీ, ఓటీ, ల్యాబ్, మెటర్నిటీ వార్డ్ లలో అందిస్తున్న సేవలకు గానూ ఎన్ క్వాస్ సర్టిఫికేషన్, లేబర్ రూమ్ మెరుగైన నిర్వహణకు గానూ లక్ష్య ప్రోగ్రామ్ లో భాగంగా సర్టిఫికేషన్ ను, అలాగే పిడియాట్రిక్ విభాగంలో ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు గానూ ముస్కాన్ సర్టిఫికేషన్ ను వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి కైవసం చేసుకుంది.హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి ఎన్ క్వాస్ గుర్తింపు పొందినందుకు గానూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు.

జిల్లాలో వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి మరో నిదర్శనమిదేనని, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన, అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News